YouVersion Logo
Search Icon

యేసుతో ముఖాముఖిSample

యేసుతో ముఖాముఖి

DAY 23 OF 40

పేతురు చాలా ఆసక్తికరమైన మనుష్యుడు మరియు ఖచ్చితంగా గుర్తుంచుకోవలసిన ఒక శిష్యుడు. అతడు యేసు నీటి మీద నడుస్తుండడం చూసి మరియు ఆయనతో చేరుటకు అడుగుతాడు (అసాధారణమైన విన్నపము). యేసు అతనిని రమ్మని పిలిచాడు. మరియు పేతురు ఆజ్ఞకు విధేయత చూపినప్పుడు అతడు నీటి మీద కొన్ని సెకన్ల పాటు నడిచాడు మరియు అతడు చుట్టుపక్కల చూసి ఉగ్రమైన తుఫానును చూస్తాడు. అతడు మునిగిపోవడం ప్రారంభించినప్పుడు యేసు అతనిని చేరుకొని మరియు పట్టుకున్నాడు మరియు అతనిని మృదువుగా మందలించాడు.

పేతురు గురించి యేసు యొక్క ప్రశ్న మన స్వంత జీవితాల కోసం మనం చూసుకోవచ్చు. సందేహం మరియు భయం అనే రెండు ఆయుధాలు శత్రువు మన విశ్వాసాన్ని తప్పించడానికి మరియు దేవుని యొక్క శక్తిని మరియు సామర్థ్యాలను నిర్లక్ష్యం చేయడానికి చాలాసార్లు ఉపయోగిస్తాడు. మన చుట్టూ కష్టాలు మరియు శ్రమలు ఉన్నప్పుడు కొన్నిసార్లు రక్షకుని మీద కంటే పోరాటం మీద దృష్టి పెట్టడం సులభం. మనం సందేహం మరియు భయంతో బాధపడుచున్నప్పుడు కూడా మన సహాయం కోసం ఉద్దేశపూర్వకంగా దేవుని వైపు చూడాల్సిన సమయం ఇది కావచ్చు.

మిమ్ములను మీరు ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలు:
ప్రస్తుతం నేను కలిగి ఉన్న అతి పెద్ద భయాలు ఏమిటి?
నేను యేసు యొక్క పాదాల వద్దకు తీసుకురావాల్సిన దేవుని గురించి నేను కలిగి ఉన్న సందేహాలు ఏమిటి?

About this Plan

యేసుతో ముఖాముఖి

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్థాయిలో యేసుతో సమయాన్ని అనుభవించుటకు నడిపించే దేవుని వాక్యముతో ఈ 40 రోజులూ ప్రతి దినం కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు అని మా నిరీక్షణ.

More