ఆది 5

5
ఆదాము నుండి నోవహు వరకు
1ఆదాము వంశావళి యొక్క జాబితా ఇదే.
దేవుడు మనుష్యజాతిని సృష్టించినప్పుడు వారిని దేవుని పోలికలో చేశారు. 2ఆయన వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించారు. ఆయన వారిని ఆశీర్వదించి వారికి “మనుష్యజాతి”#5:2 హెబ్రీలో ఆదాము అని పేరు పెట్టారు.
3ఆదాము 130 సంవత్సరాలు జీవించి తన పోలికలో తన స్వరూపంలో ఒక కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాడు. 4షేతు పుట్టిన తర్వాత ఆదాము 800 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు. 5ఆదాము మొత్తం 930 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
6షేతు 105 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి ఎనోషు పుట్టాడు. 7ఎనోషు పుట్టిన తర్వాత షేతు 807 సంవత్సరాలు బ్రతికాడు; అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 8షేతు మొత్తం 912 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
9ఎనోషు 90 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి కేయినాను పుట్టాడు. 10కేయినాను పుట్టిన తర్వాత ఎనోషు 815 సంవత్సరాలు బ్రతికాడు; అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 11ఎనోషు మొత్తం 905 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
12కేయినాను 70 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి మహలలేలు పుట్టాడు. 13మహలలేలు పుట్టిన తర్వాత కేయినాను 840 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు. 14కేయినాను మొత్తం 910 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
15మహలలేలు 65 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి యెరెదు పుట్టాడు. 16యెరెదు పుట్టిన తర్వాత మహలలేలు 830 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు. 17మహలలేలు మొత్తం 895 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
18యెరెదు 162 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి హనోకు పుట్టాడు. 19హనోకు పుట్టిన తర్వాత యెరెదు 800 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు. 20యెరెదు మొత్తం 962 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
21హనోకు 65 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి మెతూషెల పుట్టాడు. 22మెతూషెల పుట్టిన తర్వాత హనోకు 300 సంవత్సరాలు బ్రతికి దేవునితో నమ్మకంగా నడిచాడు; ఈ సమయంలో ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు. 23హనోకు మొత్తం 365 సంవత్సరాలు జీవించాడు. 24హనోకు దేవునితో నమ్మకంగా నడిచాడు; తర్వాత ఒక రోజు దేవుడు అతన్ని తీసుకెళ్లారు కాబట్టి అతడు కనబడలేదు.
25మెతూషెల 187 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి లెమెకు పుట్టాడు. 26లెమెకు పుట్టిన తర్వాత మెతూషెల 782 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు. 27మెతూషెల మొత్తం 969 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
28లెమెకు 182 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి ఒక కుమారుడు పుట్టాడు. 29అతనికి నోవహు#5:29 నోవహు హెబ్రీలో దీని అర్థం ఆదరణ అని పేరు పెట్టి, “యెహోవా శపించిన ఈ భూమిని సాగుచేయడానికి మనం పడే ప్రయాసలో, మన చేతుల బాధాకరమైన శ్రమలలో ఆయన మనలను ఆదరిస్తారు” అని అన్నాడు. 30నోవహు పుట్టిన తర్వాత లెమెకు 595 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు. 31లెమెకు మొత్తం 777 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
32నోవహు 500 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి షేము, హాము యాపెతులు పుట్టారు.

اکنون انتخاب شده:

ఆది 5: TSA

های‌لایت

به اشتراک گذاشتن

کپی

None

می خواهید نکات برجسته خود را در همه دستگاه های خود ذخیره کنید؟ برای ورودثبت نام کنید یا اگر ثبت نام کرده اید وارد شوید