యోబు 6
6
యోబు ఎలీఫజుకు జవాబిచ్చుట
1-2అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు:
“నా శ్రమే గనుక తూచబడితే,
నా కష్టం అంతా త్రాసులో ఉంచబడితే,
3సముద్రాల ఇసుక కంటె నా దుఃఖం ఎక్కువ బరువయిందని నీవు గ్రహిస్తావు!
అందుకే నా మాటలు వెర్రిగా కనిపిస్తాయి.
4సర్వశక్రిమంతుడైన దేవుని బాణాలు నాలో ఉన్నాయి.
ఈ బాణాల విషం నా ఆత్మను తాకుతుంది.
దేవుని దారుణ విషయాలు అన్నీ కలిపి నాకు విరోధంగా ఉంచబడ్డాయి.
5(ఏ చెడుగూ జరగనప్పుడు మాటలాడడం సులభం) అడవి గాడిద తినేందుకు గడ్డి ఉంటే అదేమి గొడవ చెయ్యదు.
ఆవుకు ఆహారం ఉంటే అది ఆరోపణ చెయ్యదు.
6రుచిలేని భోజనం ఉప్పు లేకుండా తినగలమా?
గ్రుడ్డులోని తెల్లసొన రుచిలేనిది.
7(ఇప్పుడు నీ మాటలు వీటివలెనే ఉన్నాయి) దానిని నేను ముట్టుకోవటానికి కూడా ఒప్పుకోను;
అలాంటి భోజనం నన్ను జబ్బు మనిషిలా చేస్తుంది.
8“నేను అడిగింది నాకు దొరకాలని కోరుకుంటాను.
నేను దేనికోసం కనిపెట్టుకొని ఉంటానో, దాన్ని దేవుడు నాకు ఇవ్వాలని కోరుకుంటాను.
9దేవుడు నన్ను చితకగొట్టేందుకు ఇష్టపడి,
నన్ను చంపివేస్తాడని నేను నిరీక్షిస్తున్నాను!
10ఆయన నన్ను చంపివేస్తే, ఒక్క విషయంలో నేను ఆదరణ పొందుతాను.
ఎడతెగని నా బాధల్లోనే నేను ఒక్క విషయంలో సంతోషిస్తాను. పరిశుద్ధుని ఆదేశాలకు విధేయత చూపేందుకు నేను తిరస్కరించలేదు.
11“నా బలం క్షీణించిపోయింది, గనుక నేను ఇంకా బ్రతుకుతాను అనే ఆశాకిరణం నాకు లేదు.
చివరికి నాకు ఏమి జరుగుతుందో నాకు తెలియదు. అందుచేత నేను సహనంగా ఉండాల్సిన కారణం ఏమీ లేదు.
12బండలాంటి బలం నాకు లేదు.
నా శరీరం కంచుతో చేయబడలేదు.
13ఇప్పుడు నాకు నేను సహాయం చేసుకొనే శక్తినాకు లేదు.
ఎందుకంటే విజయం నా వద్దనుండి తొలగించి వేయబడింది.
14“ఒక మనిషి కష్టాల్లో ఉంటే, అతని స్నేహితులు అతని మీద దయ చూపాలి.
ఒక మనిషి, తన స్నేహితుడు సర్వశక్తిమంతుడైన దేవుని నుండి దూరంగా పోయినా సరే అతడు ఆ స్నేహితునికి నమ్మకంగా ఉండాలి.
15కానీ, నా సోదరులారా, మీరు నమ్మకస్థులు కారు. నేను మీ మీద ఆధారపడలేదు.
ఒక్కొక్కప్పుడు ప్రవహించి, ఒక్కొక్కప్పుడు నిలిచిపోయే కాలువల్లా ఉన్నారు మీరు.
16మంచు గడ్డలు కరిగిపోయే హిమం అడ్డుకొన్నప్పుడు పొంగి ప్రవహించే కాలువల్లా ఉన్నారు మీరు.
17కానీ ఆ కాలువలు ఎండిపోయిన వేళ ప్రవహించవు.
వేడిగాలి వీచినప్పుడు నీళ్లు ఉండవు.
కాలువలు ప్రవహించవు.
18వ్యాపారస్థులు వారి మార్గాలలోని మలుపుల మూలలు తిరిగి
ఎడారిలోకి వెళ్లి అక్కడ మరణిస్తారు.
19తేమా వర్తక బృందాలు నీళ్లకోసం వెదుకుతారు.
షేబా ప్రయాణీకులు ఆశగా (నీళ్ల కోసం) చూస్తారు.
20నీళ్లు దొరుకునని వారు గట్టిగా నమ్మారు.
కానీ ఈసారి వారు అక్కడికి రాగానే నిరాశ చెందారు.
21ఇప్పుడు మీరూ ఆ కాలువల్లా ఉన్నారు.
మీరు సహాయం చేయరు. మీరు నా కష్టాలు చూచి భయపడుతున్నారు.
22నాకు ఏమైనా ఇవ్వండి,
మీ ఐశ్వర్యంలోనుండి నాకు ధనం ఇవ్వండి అని నేను ఎన్నడూ చెప్పలేదు.
23‘శత్రువు బలంనుండి నన్ను రక్షించండి.
మూర్ఖులైన వారి నుండి నన్ను రక్షించండి’ అని నేను ఎన్నడూ చెప్పలేదు.
24“కనుక, ఇప్పుడు నాకు నేర్పించండి. నేను నెమ్మదిగా ఉంటాను.
నేను ఏమి తప్పు చేశానో నాకు చూపించండి.
25నిజాయితీ మాటలు శక్తి గలవి.
కానీ మీ వాదాలు దేనినీ రుజువు చేయవు.
26నేను చెప్పే వాటిని మీరు విమర్శిస్తారా?
మరింత నిరుత్సాహం కలిగించే మాటలు పలుకుతారా?
27అవును, తండ్రులు లేని పిల్లలకు చెందిన వాటిని సంపాదించటం కోసం
మీరు జూదమైనా సరే ఆడతారు.
మీరు మీ స్నేహితుణ్ణి అమ్ముకొంటారు.
28కానీ, ఇప్పుడు దయచేసి నా ముఖం పరిశీలించండి.
నేను మీతో అబద్ధం చెప్పను.
29కనుక ఇప్పుడు మీ మనసు మార్చుకోండి. అన్యాయంగా ఉండవద్దు.
అవును, మళ్లీ ఆలోచించండి. నేను తప్పు ఏమీ చేయలేదు.
30నేను అబద్ధం చెప్పటం లేదు.
నా మాటల్లో చెడు ఏమీ లేదు. తప్పు, ఒప్పు నాకు తెలుసు.”
Currently Selected:
యోబు 6: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International