YouVersion Logo
Search Icon

యోబు 3

3
యోబు తన పుట్టిన రోజును శపించుట
1అప్పుడు యోబు తన నోరు తెరచి, తాను పుట్టిన రోజును శపించాడు. 2-3అతడు ఇలా అన్నాడు:
“నేను పుట్టిన ఆ రోజు ఉండకుండా పోవును గాక.
‘పిల్లవాడు పుట్టాడు!’ అని చెప్పబడిన ఆ రాత్రి ఉండకుండా పోవునుగాక. అది పోవునుగాక.
4ఆ రోజు చీకటి అవును గాక.
ఆ రోజును దేవుడు లక్ష్యపెట్టకుండును గాక. ఆ రోజున వెలుగు ప్రకాశింపకుండును గాక.
5ఆ రోజు మరణాంధకారమవును గాక.
ఆ రోజును ఒక మేఘము కప్పివేయును గాక.
నేను పుట్టిన ఆనాటి వెలుగును కారు మేఘాలు భయపెట్టి వెళ్లగొట్టును గాక.
6గాఢాంధకారము ఆ రాత్రిని పట్టుకొనును గాక.
ఆ రాత్రి సంవత్సరపు దినములలో ఒకటిగా ఎంచబడకుండును గాక.
ఆ రాత్రిని ఏ నెలలో కూడ చేర్చవద్దు.
7ఆ రాత్రి ఎవడును జననం కాకపోవును గాక.
ఆ రాత్రి ఏ ఆనంద శబ్దం వినుపించకుండా ఉండును గాక.
8శాపాలు పెట్టే మంత్రగాళ్లు నేను పుట్టిన ఆ రోజును శపించెదరు గాక.
సముద్రపు రాక్షసికి కోపం పుట్టించుట ఎట్లో ఎరిగిన మనుష్యులు వారు.
9ఆ నాటి వేకువ చుక్క చీకటి అవునుగాక.
ఆ రాత్రి ఉదయపు వెలుగుకోసం కనిపెట్టి ఉండును గాక.
కానీ ఆ వెలుగు ఎన్నటికీ రాకుండును గాక.
ఆ రాత్రి సూర్యోదయపు మొదటి కిరణాలు చూడకుండును గాక.
10ఎందుకనగా ఆ రాత్రి, నా తల్లి గర్భద్వారాలను మూసివేయలేదు.
(అది పుట్టకుండా అరికట్టలేదు) అది నా కన్నులనుండి కష్టాలను దాచలేదు.
11నేను పుట్టినప్పుడే నేనెందుకు మరణించలేదు?
నా తల్లి గర్భం నుండి వచ్చేటప్పుడు నేనెందుకు మరణించలేదు?
12నా తల్లి ఎందుకు నన్ను తన మోకాళ్లమీద పెట్టుకొంది?
నా తల్లి స్తనములు నాకెందుకు పాలిచ్చాయి?
13నేను పుట్టినప్పుడే నేను మరణించి ఉంటే
ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండేవాణ్ణి.
14భూమి మీద బ్రతికిన రాజులు, జ్ఞానులతో బాటు విశ్రాంతిలో ఉంటే ఎంత బాగుండును
ఆ రాజులు, జ్ఞానులచే నిర్మింపబడిన ఆ కట్టడాలు ఇప్పుడు నాశనమై పోయాయి.
15నేను కూడ ఆ పాలకులతో పాటు పాతిపెట్టబడి ఉంటే ఎంత బాగుండును.
వారికి బంగారం ఉంది, వారి ఇండ్లను వెండితో నింపుకొన్నారు!
16నేను పుట్టినప్పుడే చనిపోయి,
మట్టిలో పాతి పెట్టబడిన శిశువుగా ఎందుకు ఉండలేదు?
ఎన్నడూ వెలుగు చూడని శిశువులా నేను ఉంటే
ఎంత బాగుండును.
17చెడ్డ మనుష్యులు సమాధిలో ఉన్నప్పుడు తొందర కలిగించటం మానివేస్తారు.
అలసిపోయిన మనుష్యులకు సమాధిలో విశ్రాంతి లభిస్తుంది.
18ఖైదీలు కూడా సమాధిలో సుఖంగా ఉంటారు.
కాపలాదారుల స్వరం వారు వినరు.
19ప్రముఖ ప్రజలు, సామాన్య ప్రజలు అన్ని రకాల ప్రజలు సమాధిలో ఉంటారు.
మరియు బానిస తన యజమాని నుండి విడుదల అవుతాడు.
20“శ్రమ పడుతూ, చాలా విచారంగా ఉన్న మనిషిని ఇంకా బ్రతుకుతూ ఉండనియ్యటం ఎందుకు?
ఆత్మ వేదనతో ఉన్న వానికి జీవం ఇవ్వబడటం ఎందుకు?
21ఆ మనిషి చావాలని కోరుకొంటాడు. కాని చావురాదు.
విచారంలో ఉన్న ఆ మనిషి దాగి ఉన్న ఐశ్వర్యాలకంటే మరణంకోసం ఎక్కువగా వెదకుతాడు.
22ఆ మనుష్యులు సమాధిని కనుగొన్నప్పుడు చాలా సంతోషిస్తారు.
వారు పాతిపెట్టబడినప్పుడు ఆనందిస్తారు.
23దేవుడు వారి భవిష్యత్తును రహస్యంగా ఉంచుతాడు.
వారి చుట్టూ ఒక గోడ కడతాడు.
24నేను భోజనం చేయను. కాని నేను దుఃఖధ్వనులు చేస్తాను.
కాని సంతోషంతో కాదు. నా ఆరోపణలు నీళ్లలా ప్రవహిస్తున్నాయి.
25నాకు ఏదో దారుణం జరుగుతుందేమో అని భయ పడ్డాను.
అలానే జరిగింది నాకు!
26నాకు శాంతి లేదు. విశ్రాంతి లేదు.
నాకు విశ్రాంతి లేదు. కష్టం మాత్రమే ఉంది!”

Currently Selected:

యోబు 3: TERV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in