YouVersion Logo
Search Icon

యోబు 29

29
యోబు తన మాటలు కొనసాగించటం
1యోబు మాట్లాడటం కొనసాగించాడు. యోబు ఇలా అన్నాడు:
2“దేవుడు నన్ను కాపాడి, నా విషయం జాగ్రత్త తీసుకొన్న ఇటీవలి మాసాల్లో ఉన్నట్టుగానే
నా జీవితం ఉంటే బాగుండునని నేను ఆశిస్తున్నాను.
3నేను చీకటిలో నడచినప్పుడు నాకు వెలుగు ఇచ్చుటకు నా తలమీద దేవుని వెలుగు ప్రకాశించే సమయం వస్తే బాగుండునని నేను ఆశిస్తున్నాను.
(నేను జీవించవలసిన సరియైన మార్గాన్ని దేవుడు నాకు చూపించాడు).
4నా జీవితం ఎంతో విజయవంతంగా ఉండి దేవుడు నాకు సన్నిహితమైన స్నేహితునిగా ఉండే రోజుల కోసం నేను ఆశిస్తున్నాను.
అవి దేవుడు నా ఇంటిని ఆశీర్వదించిన రోజులు.
5సర్వశక్తిమంతుడైన దేవుడు ఇంకా నాతో ఉండగా
నా పిల్లలు నా దగ్గర ఉన్న సమయం కోసం నేను ఆశిస్తున్నాను.
6అది నా జీవితం ఎంతో బాగున్నప్పటి మాట.
నా మార్గం అంతా మీగడతో నిండిపోయినట్టు, నా కోసం ఒలీవ నూనెను నదులుగా ప్రవహించి నట్టు అది కనబడింది.
7“నేను పట్టణ ద్వారం దగ్గరకు వెళ్లి పట్టణ పెద్దలతో కలిసి
ఆరుబయట కూర్చున్న రోజులు అవి.
8అక్కడ ప్రజలంతా నన్ను గౌరవించేవారు. యువకులు నన్ను చూచినప్పుడు పక్కకు తప్పుకొనేవారు.
పెద్దలు నా యెడల గౌరవ సూచకంగా లేచి నిలబడేవారు.
9ప్రజానాయకులు నన్ను చూడగానే మాట్లాడటం నిలిపివేసి
నోటిమీద చేయి వేసుకొనేవారు (ఇతరులను నిశ్శబ్దంగా ఉంచటానికి).
10చాలా ప్రముఖ నాయకులు కూడా, నేను వారిని సమీపించినప్పుడు వారి స్వరాలు తగ్గించేవారు.
అవును వారి నాలుకలు వారి అంగిట అంటుకొని పోయినట్లు కనిపించేది.
11నేను మాట్లాడటం విన్నవారు ఎవరైనా సరే, నన్ను గూర్చి మంచి మాటలు చెప్పేవారు.
నన్ను చూచిన వారు నన్ను పొగిడారు.
12ఎందుకంటే, పేదవాడు ఒకడు సహాయం కోసం వేడుకొంటే, నేను సహాయం చేశాను.
తల్లి దండ్రులు లేని బిడ్డ విషయం శ్రద్ధ తీసుకొనేవారు ఎవరూ లేనప్పుడు నేను సహాయం చేశాను.
13మరణించే మనిషీ నన్ను ఆశీర్వదించాడు.
అవసరంలో ఉన్న విధవలకు నేను సహాయం చేసాను.
14సక్రమంగా జీవించటం నాకు వస్త్రం.
న్యాయం నాకు అంగీలా, తలపాగాలా ఉండేది.
15గుడ్డివారికి నా కళ్లతో నేను సహాయం చేశాను.
కుంటివారికి నా పాదాలతో నేను సహాయం చేశాను.
16పేద ప్రజలకు నేను ఒక తండ్రిలా ఉన్నాను.
కష్టాలలో ఉన్న పరాయివారి పక్షం నేను వహించాను.
17దుర్మార్గుల శక్తిని నేను నాశనం చేశాను.
దుర్మార్గుల బారి నుండి నిర్దోషులను నేను రక్షించాను.
18“నేను ఎల్లప్పుడూ ఇలా తలచేవాణ్ణి. నేను చాలాకాలం బ్రతుకుతాను.
తర్వాత నా స్వంత ఇంటిలో మరణిస్తాను.
19వేర్లు ఎల్లప్పుడూ నీటిని తాకుతూ ఆకులు ఎల్లప్పుడు
మంచుతో తడిగా ఉండే చెట్టులా నేను ఉన్నాను.
20నాలో నా మహిమ ఎల్లప్పుడూ కొత్తదిగా ఉంటుంది.
నాచేతిలో ఒక కొత్త విల్లు ఉన్నట్టుగా నేను ఎల్లప్పుడూ బలంగా ఉంటాను.
21“నేను మాట్లాడటం చాలించిన తరువాత నా మాటలు వింటున్న ప్రజలు చెప్పాల్సింది ఇంకేమీ ఉండేది కాదు.
నా మాటలు వారి చెవులకు సౌమ్యంగా వినిపించేవి.
22ప్రజలు వర్షంకోసం వేచి ఉన్నట్టు,
నేను మాట్లాడాలని వారు వేచి ఉండేవారు.
23నా మాట వసంతకాలపు వర్షంలా ఉండేది. నా మాటల్ని వారు పానం చేసేవారు.
అధైర్యపడినవారిని చూచి నేను చిరునవ్వు నవ్వేవాడిని.
24నా ప్రసన్న ముఖం క్రుంగిన ప్రజలకు మంచి అనుభూతిని కలిగించేది.
25ప్రజల పట్ల బాధ్యత వహించి నేను నిర్ణయాలు చేసాను. నేను నాయకుణ్ణి అయ్యాను.
తన సైన్య దళాలలో ఒక రాజులా నేను జీవించాను. చాలా విచారంలో ఉన్న ప్రజలకు ఆదరణ ఇచ్చే మనిషిలా నేను ఉన్నాను.

Currently Selected:

యోబు 29: TERV

Highlight

Share

Compare

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in