YouVersion Logo
Search Icon

యోబు 28

28
1“మనుష్యులకు వెండి లభించే గనులు ఉన్నాయి.
మనుష్యులు బంగారాన్ని కరిగించి, దానిని శుభ్రం చేసే స్థలాలు ఉన్నాయి.
2మనుష్యులు భూమినుండి ఇనుమును తవ్వుతారు.
బండల నుండి రాగి కరిగించబడుతుంది.
3పనివాళ్లు గుహల్లోకి దీపం తీసుకొని వస్తారు.
ఆ గుహల్లో లోపలికి వారు వెదుకుతారు. లోపలి చీకటిలో బండల కోసం వారు వెదుకుతారు.
4మనుష్యులు నివసించే చోటికి దూరంగా పనివాళ్లు గోతులు తవ్వుతారు.
మరి ఏ మనిషీ కూడ గోతులను ఎన్నడూ తాకలేదు.
పనివాడు లోతైన ఆ గోతుల్లోనికి తాళ్లతో దిగేటప్పుడు అతడు యితరులకు చాలా దూరంలో ఉంటాడు.
5భూమిపై నుండి ఆహారం వస్తుంది.
కానీ భూమి క్రింద, వస్తువులను మంట మార్చివేసినట్టు,
అది మార్చివేయబడుతుంది.
6నేలక్రింద బండలలో నీల రత్నాలు లభ్యమవుతాయి.
నేల కింద మట్టిలో బంగారం ఉంది.
7ఆహారం కోసం జంతువులను తినే పక్షులకు భూమికింద మార్గాలు తెలియవు.
డేగ కూడా ఈ మార్గం చూడదు.
8క్రూర మృగాలు ఈ మార్గంలో నడవలేదు.
సింహాలు ఈ మార్గంలో పయనించలేదు.
9పనివాళ్లు కఠిన శిలలను తవ్వుతారు.
ఆ పనివాళ్లు పర్వతాలను తవ్వి, వాటిని ఖాళీ చేస్తారు.
10పనివాళ్లు బండల్లోనుంచి సొరంగాలు తవ్వుతారు.
బండల్లోని ఐశ్వర్యాలు అన్నింటినీ వాళ్లు చూస్తారు.
11నీళ్లు ప్రవహించకుండా నిలిపేందుకు పనివాళ్లు ఆన కట్టలు కడతారు.
దాగి ఉన్న వాటిని వారు వెలుగు లోనికి తీసికొని వస్తారు.
12“అయితే మనిషికి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది?
గ్రహించటం ఎలా అనేది నేర్చుకొనేందుకు మనం ఎక్కడికి వెళ్లాలి?
13జ్ఞానం చాలా అమూల్యమయిందని మనుష్యులు గ్రహించరు.
భూమి మీద నివసించే మనుష్యులకు జ్ఞానం లేదు.
14‘జ్ఞానం నాలో లేదు’ అని అగాధ మహాసముద్రం అంటుంది.
‘జ్ఞానం నా దగ్గరా లేదు’ అని సముద్రం అంటుంది.
15అతి ఖరీదైన బంగారంతో జ్ఞానం కొనలేము.
జ్ఞానం ఖరీదు వెండితో లెక్క కట్టబడజాలదు.
16ఓఫీరు బంగారంతో గాని, విలువైన గోమేధికంతోగాని,
నీలంతో గాని, అది కొనబడేది కాదు.
17బంగారం, స్ఫటికం కంటే జ్ఞానం విలువైనది.
బంగారంతో చేయబడిన చాలా ఖరీదైన నగలతో జ్ఞానం కొనబడజాలదు.
18జ్ఞానం పగడాలకంటె, పచ్చలకంటె విలువగలది.
జ్ఞానం కెంపులకంటె ఖరీదైనది.
19ఇథియోపియా (కూషు)దేశపు పుష్యరాగం జ్ఞానం కంటె విలువైనది కాదు.
మేలిమి బంగారంతో మీరు జ్ఞానమును కొనలేరు.
20“అలాగైతే జ్ఞానం కనుగొనాలంటే మనం ఎక్కడికి వెళ్లాలి?
అవగాహన చేసికోవటం నేర్చుకొనేందుకు మనం ఎక్కడికి వెళ్లాలి?
21భూమి మీద ప్రతి మనిషి నుండీ జ్ఞానం దాచబడింది.
ఎత్తుగా ఆకాశంలో ఉన్న పక్షులు కూడా జ్ఞానాన్ని చూడలేవు.
22‘మేము జ్ఞానమును గూర్చిన ప్రచారం మాత్రమే విన్నాం’
అని మరణం, నాశనం చెబుతాయి.
23“కానీ జ్ఞానానికి మార్గం దేవునికి మాత్రమే తెలుసు.
జ్ఞానం ఎక్కడ నివసిస్తుందో దేవునికి తెలుసు.
24భూదిగంతాలకు గల మొత్తం మార్గాన్ని దేవుడు చూస్తాడు గనుక ఆయనకు జ్ఞానం తెలుసు.
ఆకాశాల క్రింద ఉన్న సర్వాన్ని దేవుడే చూస్తాడు.
25గాలికి దాని శక్తిని దేవుడు ఇచ్చినప్పుడు,
మహా సముద్రాలు ఎంత పెద్దవిగా ఉండాలో ఆయన నిర్ణయించినప్పుడు,
26వర్షాన్ని ఎక్కడ కురిపించాలి,
ఉరుములు తుఫానులు ఎటువైపుగా వెళ్లాలి అని దేవుడు నిర్ణయించినప్పుడు
27అది దేవుడు జ్ఞానాన్ని చూచిన సమయం, జ్ఞానం యొక్క విలువ ఎంతో చూచేందుకు
దానిని పరీక్షించిన సమయం అవుతుంది.
జ్ఞానాన్ని దేవుడు నిర్ధారణ చేశాడు.
28‘యెహోవాకు భయపడి, ఆయనను గౌరవించటం జ్ఞానం అవుతుంది.
చెడు సంగతుల నుండి తప్పుకోవటం అవగాహన అవుతుంది’”
అని దేవుడు ప్రజలతో చెప్పాడు.

Currently Selected:

యోబు 28: TERV

Highlight

Share

Compare

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for యోబు 28