యోబు 16
16
ఎలీఫజుకు యోబు జవాబు
1అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు:
2“ఈ విషయాలు నేను యిదివరకే విన్నాను.
మీరు ముగ్గురూ నాకు కష్టమే కలిగిస్తున్నారు కాని ఆదరణకాదు.
3మీ దీర్గ ఉపన్యాసాలకు అంతం లేదు.
మీరెందుకు వాదము కొనసాగిస్తారు?
4నా కష్టాలే మీకు ఉంటే ఇప్పుడు
మీరు చెబుతున్న మాటలు నేనూ చెప్పగలను.
మీకు విరోధంగా జ్ఞానం గల మాటలు చెప్పి,
మిమ్మల్ని చూచి నేను తల ఊపగలను.
5కాని నేను చెప్పే మాటలతో నేను మిమ్మల్ని ప్రోత్సహించి మీకు ఆశ ఇవ్వగలను.
6“అయితే నేను చెప్పేది ఏదీ నా బాధ పోయేట్టుగా చేయలేదు.
కానీ నేను మాట్లాడకపోతే నాకు ఆదరణ లేదు.
7నిజంగా దేవా, నీవు నా బలం తీసివేశావు.
నా కుటుంబం మొత్తాన్ని నీవు నాశనం చేశావు.
8నీవు నన్ను కట్టివేశావు. అది ప్రతి ఒక్కరూ చూడగలరు.
నా శరీరం రోగంతో ఉంది, నేను భయంకరంగా కనబడుతున్నాను.
దాని అర్థం నేను దోషిని అని ప్రజలు తలస్తున్నారు.
9“దేవుడు నా మీద దాడి చేస్తున్నాడు,
ఆయన నా మీద కోపంగా ఉండి నా శరీరాన్ని చీల్చి వేస్తున్నాడు.
దేవుడు నా మీద తన పళ్లు కొరుకుతున్నాడు.
నా శత్రువుల కళ్లు ద్వేషంతో చూస్తున్నవి.
10మనుష్యులు నన్ను చూచి నవ్వుతారు.
వాళ్లంతా నా చుట్టూ చేరి నన్ను అవమానించి నా ముఖం మీద కొట్టడానికి సమ్మతిస్తారు.
11దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించాడు.
12నా విషయం అంతా బాగానే ఉంది. నేను నెమ్మదిగా జీవిస్తూ వచ్చాను.
కాని దేవుడు నన్ను చితుకగొట్టేశాడు.
అవును ఆయన నన్ను మెడపట్టి లాగి,
నన్ను ముక్కలు ముక్కలుగా విరుగగొట్టాడు.
గురి చూసి కొట్టడం అభ్యసించడానికి దేవుడు నన్ను ప్రయోగిస్తున్నాడు.
13దేవుని విలుకాండ్లు నా చుట్టూరా ఉన్నారు.
నా మూత్రపిండాలలో ఆయన బాణాలు కొడుతున్నాడు.
ఆయన దయ చూపించడు. ఆయన నా పైత్య రసాన్ని నేలమీద ఒలకబోస్తాడు.
14మరల మరల దేవుడు నా మీద దాడి చేస్తాడు.
యుద్ధంలో సైనికునిలా ఆయన నా మీదకు పరుగెత్తుతాడు.
15“నేను (యోబు) చాలా విచారంగా ఉన్నాను,
కనుక గోనెపట్టతో చేయబడిన బట్టలు నేను ధరిస్తాను.
నేను ఇక్కడ దుమ్ములో, బూడిదలో కూర్చొని
ఓడిపోయినట్టుగా భావిస్తున్నాను.
16ఏడ్చుట మూలంగా నా ముఖం ఎర్రబడింది.
ఛాయలు నా కళ్ల చుట్టూరా ఉంగరాల్లా ఉన్నాయి.
17నేను ఎన్నడూ క్రూరమైన నేరం ఏది చేయలేదు.
నా ప్రార్థన నిర్మలమయినది.
18“భూమీ, నా రక్తాన్ని దాచి పెట్టకు. (నాకు జరిగిన చెడుగులను కప్పి పెట్టకు).
న్యాయం కోసం అరిచే నా అరుపులను (ప్రార్థనలను) ఆగిపోనీయకు.
19ఇప్పుడు కూడ ్ర ఉండి నాకు సాక్షిగా ఉన్నాడు.
20నా స్నేహితులు నాకు విరోధంగా ఉన్నారు.
కాని నా కన్నులు దేవుని కోసం కన్నీళ్లు కారుస్తున్నాయి.
21ఒక మనిషి తన స్నేహితుని కోసం బ్రతిమలాడినట్టుగా,
నా కోసం దేవునిని బ్రతిమలాడే ఒక మనిషి నాకు కావాలి.
22“నేను ఏ చోట నుండి (మరణం) తిరిగి రానో ఆ చోటికి నేను వెళ్లేందుకు ఇంకా కొద్ది సంవత్సరాలే జరగాల్సి ఉంది.
Currently Selected:
యోబు 16: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International