యోబు 15
15
యోబుకు ఎలీఫజు జవాబు
1అప్పుడు తేమానువాడైన ఎలీఫజు యోబుకు జవాబిచ్చాడు:
2“యోబూ! నీవు నిజంగా జ్ఞానం గలవాడవైతే
నీవు వట్టి మాటలతో జవాబు ఇవ్వవు.
జ్ఞానం గల మనిషి పూర్తిగా తూర్పు వేడిగాలి (పనికిమాలిన మాటల) తో ఉండడు.
3జ్ఞానం గల మనిషి పనికిమాలిన మాటలతో, అర్థం లేని
ఉపన్యాసాలతో వాదిస్తాడని నీవు తలుస్తావా?
4యోబూ! నీ యిష్టం వచ్చినట్టు నీవు ఉంటే
ఎవ్వరూ దేవుణ్ణి గౌరవించరు, ఆయన్ని ప్రార్థించరు. దేవుని సన్నిధియందు చేసే ధ్యానానికి నీవు ఆటంకం తెస్తావు.
5నీవు చెప్పే విషయాలు నీ పాపాన్ని తేటగా చూపిస్తాయి.
యోబూ! నీవు తెలివిగల మాటలు ప్రయోగించి నీ పాపాన్ని దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నావు.
6నీది తప్పు అని నేను నీకు రుజువు చేయాల్సిన అవసరం లేదు.
ఎందుకు? నీ స్వంత నోటితో నీవు పలికే విషయాలే నీ తప్పును తెలియ జేస్తున్నాయి.
నీ స్వంత పెదాలు నీకు విరోధంగా మాట్లాడుతున్నాయి.
7“యోబూ! మొట్ట మొదట పుట్టింది నీవే అని తలుస్తున్నావా?
కొండలు చేయబడక ముందే నీవు జన్మించావా?
8దేవుని రహస్య పథకాలు నీవు విన్నావా?
నీ మట్టుకు నీవు ఒక్కడవు మాత్రమే జ్ఞానం గలవాడవని తలుస్తున్నావా?
9యోబూ! నీకు తెలిసిన దానికంటే మాకు ఎక్కువ తెలుసు.
నీవు గ్రహించలేని విషయాలు మేము గ్రహిస్తాం.
10తల నెరసిన మనుష్యులు మరియు వృద్ధులు మాతో ఏకీభవిస్తారు.
అవును, చివరికి నీ తండ్రికంటే పెద్ద వాళ్లు కూడా మా పక్షంగా ఉన్నారు.
11దేవుడు నిన్ను ఆదరించేందుకు ప్రయత్నిస్తాడు
కానీ నీకు అది మాత్రమే చాలదు.
సౌమ్యమయిన పద్ధతిలో దేవుని సందేశం మేము నీకు చెప్పాము.
12యోబూ! నీవెందుకు అర్థం చేసుకోవు?
సత్యాన్ని ఎందుకు చూడలేక పోతున్నావు?
13నీవు ఈ కోపపు మాటలు చెప్పినప్పుడు
నీవు దేవునికి విరోధంగా ఉన్నావు.
14“ఒక మనిషి వాస్తవంగా పరిశుద్ధంగా ఉండలేడు.
స్త్రీ నుంచి జన్మించిన మనిషి, దేవునితో సరిపడి ఉండ జాలడు.
15దేవుడు కనీసం తన దూతలను కూడ నమ్మడు.
దూతలు నివసించే ఆకాశం కూడా పవిత్రమైనది కాదు.
16మానవుడు అంతకంటే దౌర్భాగ్యుడు.
మానవుడు అసహ్యమైనవాడు మరియు పాడైపోయాడు.
అతడు మంచి నీళ్లు త్రాగినట్టుగా కీడును త్రాగుతాడు.
17“యోబూ, నా మాట విను. నేను దానిని నీకు వివరిస్తాను.
నాకు తెలిసిన దానిని నేను నీతో చెబుతాను.
18జ్ఞానం గల మనుష్యులు నాతో చెప్పిన విషయాలు నేను నీతో చెబుతాను.
ఆ జ్ఞానం గల మనుష్యుల పూర్వీకులు ఈ విషయాలను వారితో చెప్పారు.
ఆ జ్ఞానులు రహస్యాలేమీ నా దగ్గర దాచిపెట్టలేదు.
19వారికే (జ్ఞానులకే) దేశం ఇవ్వబడింది.
వారిని ఇబ్బంది పెట్టేందుకు పరాయివాళ్లు ఎవరూ ఆ దేశంలో లేరు.
20దుర్మార్గుడు తన జీవితకాలమంతా బాధతో శ్రమ పడతాడు.
క్రూరమైన మనిషి తన కోసం దాచ బడిన సంవత్సరాలన్నింటిలో శ్రమపడతాడు,
21భయంకర శబ్దాలు అతని చెవులకు వినిపిస్తాయి
మరియు అతడు క్షేమంగా ఉన్నానని అనుకొన్నప్పుడు శత్రువు అతని మీద దాడి చేస్తాడు.
22దుర్మార్గపు వ్యక్తి చాలా విసిగిపోతాడు. చీకటి నుండి తప్పించుకొనే ఆశ అతనికి ఉండదు.
అతణ్ణి చంపివేసేందుకు ఎక్కడో ఒక ఖడ్గం కనిపెడుతూనే ఉంటుంది.
23అతడు అటూ ఇటూ ఆహారం కోసం ‘ఎక్కడ అది’ అంటూ సంచరిస్తూనే ఉంటాడు.
కాని అతని శరీరం రాబందులకు ఆహారం అవుతుంది. అతనికి చావు మూడిందని అతనికి తెలుసు.
24చింత, శ్రమ అతణ్ణి భయపెడుతున్నాయి. అతణ్ణి నాశనం చేసేందుకు
ఒక రాజు సిద్ధంగా ఉన్నట్టు ఈ విషయాలు అతనిపై దాడి చేస్తాయి.
25ఎందుకంటే దుర్మార్గుడు దేవుని మీద తన పిడికిలి బిగిస్తాడు కనుక దుర్మార్గుడు దేవునికి విధేయుడయ్యేందుకు నిరాకరిస్తాడు.
సర్వశక్తిమంతుడైన దేవునికి విరోధంగా దుర్మార్గుడు బలవంతునిగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు.
26ఆ మనిషి చాలా మొండివాడు.
దుర్మార్గుడు తన బలమైన లావుపాటి కేడెముతో దేవుని మీద దాడి చేస్తాడు.
27దుర్మార్గుడు ధనవంతుడై ముఖం కొవ్వుతో నిండి వుండవచ్చు.
వాని నడుము కొవ్వు పొరలతో బలిసి ఉండవచ్చు.
28కానీ శిథిలమైన పట్టణాల్లో వాడు నివసిస్తాడు.
ఎవరూ నివసించని ఇండ్లలో ఆ దుర్మార్గుడు నివసిస్తాడు.
అవి పడిపోయేట్టు ఉన్న శిథిల గృహాలు.
29దుర్మార్గుడు ధనికుడుగా ఉండవచ్చు.
అతని ఐశ్వర్యం ఎక్కువ కాలం ఉండదు.
అతని పంటలు ఎక్కువగా పండవు.
30దుర్మార్గుడు చీకటిని తప్పించుకోలేడు.
అగ్నిచేత కొమ్మలు కాలిపోయిన చెట్టులా అతడు ఉంటాడు.
దేవుని శ్వాస దుర్మార్గుని తుడిచివేస్తుంది.
31దుర్మార్గుడు పనికిమాలిన వాటిని నమ్ముకొని తనను తానే మోసం చేసుకోకూడదు.
ఎందుకంటే, వానికి ఏమీ దొరకదు కనుక.
32దుర్మార్గుని ఆయుష్షు తీరిపోకముందే
వాడు ముసలివాడై, ఎండిపోతాడు. మళ్లీ ఎన్నటికి పచ్చగా ఉండని ఎండిపోయిన కొమ్మలా అతడు ఉంటాడు.
33ద్రాక్షాపండ్లు పక్వానికి రాకముందే రాలిపోతున్న ద్రాక్షావల్లిలా దుర్మార్గుడు ఉంటాడు.
ఆ వ్యక్తి పూలు రాలిపోయిన ఒలీవ చెట్టులా ఉంటాడు.
34ఎందుకంటే, దేవుడు లేని ప్రజల పని వ్యర్థము.
డబ్బును ప్రేమించే మనుష్యుల ఇండ్లు అగ్నిచేత నాశనం చేయబడతాయి.
35వారు కష్టాలకు పథకం వేసి దుర్మార్గపు పనులు చేస్తారు.
మనుష్యులను మోసం చేసేందుకు వారు ప్రయత్నం చేస్తారు.”
Currently Selected:
యోబు 15: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International