YouVersion Logo
Search Icon

కీర్తనలు 93

93
1యెహోవా రాజ్యము చేయుచున్నాడు
ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించియున్నాడు
యెహోవా బలముధరించి బలముతో నడుము కట్టు
కొనియున్నాడు
కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడియున్నది.
2పురాతనకాలమునుండి నీ సింహాసనము స్థిరమాయెను
సదాకాలము ఉన్నవాడవు నీవే
3వరదలు ఎలుగెత్తెను యెహోవా, వరదలు ఎలుగెత్తెను
వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి
4విస్తారజలముల ఘోషలకంటెను బలమైన సముద్ర
తరంగముల ఘోషలకంటెను
ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు
5నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు
యెహోవా, ఎన్న టెన్నటికి పరిశుద్ధతయే నీ మందిర
మునకు అనుకూలము.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for కీర్తనలు 93