YouVersion Logo
Search Icon

కీర్తనలు 92

92
విశ్రాంతిదినమునకు తగిన కీర్తన. గీతము.
1యెహోవాను స్తుతించుట మంచిది
2-3మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది.
ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను
పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల
సితారాతోను ప్రచురించుట మంచిది.
4ఎందుకనగా యెహోవా, నీ కార్యముచేత నీవు నన్ను
సంతోషపరచుచున్నావు
నీ చేతిపనులబట్టి నేను ఉత్సహించుచున్నాను.
5యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి!
నీ ఆలోచనలు అతిగంభీరములు,
6పశుప్రాయులు వాటిని గ్రహింపరు
అవివేకులు వివేచింపరు.
7నిత్యనాశనము నొందుటకే గదా
భక్తిహీనులు గడ్డివలె చిగుర్చుదురు.
చెడుపనులు చేయువారందరు పుష్పించుదురు.
8యెహోవా, నీవే నిత్యము మహోన్నతుడవుగా
నుందువు
9నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశిం
చెదరు
చెడుపనులు చేయువారందరు చెదరిపోవుదురు.
10గురుపోతు కొమ్మువలె నీవు నా కొమ్ము పైకెత్తితివి
క్రొత్త తైలముతో నేను అంటబడితిని.
11నాకొరకు పొంచినవారి గతి నాకన్నులు ఆశతీర
చూచెను
నాకువిరోధముగా లేచినదుష్టులకు సంభవించినది
నా చెవులకు వినబడెను
12నీతిమంతులు ఖర్జూరవృక్షమువలె మొవ్యువేయుదురు
లెబానోనుమీది దేవదారు వృక్షమువలె వారు
ఎదుగుదురు
13యెహోవా మందిరములో నాటబడినవారైవారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు.
14నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతు
డనియు
ఆయనయందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి
చేయుటకై
15వారు ముసలితనమందు ఇంక చిగురు పెట్టుచుందురు
సారము కలిగి పచ్చగా నుందురు.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for కీర్తనలు 92