YouVersion Logo
Search Icon

కీర్తనలు 27

27
దావీదు కీర్తన.
1యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు,
నేను ఎవరికి భయపడుదును?
యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?
2నా శరీరమాంసము తినుటకై దుష్టులు నామీదికి
వచ్చినప్పుడు
నన్ను బాధించు శత్రువులు నామీదికి వచ్చినప్పుడువారు తొట్రిల్లికూలిరి
3నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను
నా హృదయము భయపడదు
నామీదికి యుద్ధము రేగినను
దీనిలో నేను ధైర్యము విడువకుందును.
4యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని
దానిని నేను వెదకుచున్నాను.
యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆల
యములో ధ్యానించుటకును
నా జీవితకాలమంతయు నేను యెహోవామందిర
ములో నివసింప గోరుచున్నాను.
5ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును
తన గుడారపు మాటున నన్ను దాచును
ఆశ్రయదుర్గముమీద ఆయన నన్ను ఎక్కించును.
6ఇప్పుడు నన్ను చుట్టుకొనియున్న నా శత్రువుల
కంటె ఎత్తుగా నా తలయెత్తబడును.
ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు
బలులు అర్పించెదను.
నేను పాడెదను, యెహోవానుగూర్చి స్తుతిగానము
చేసెదను.
7యెహోవా, నేను కంఠధ్వని యెత్తి నిన్ను ప్రార్థించునప్పుడు నా మనవి ఆలకింపుము
కరుణతో నాకుత్తరమిమ్ము.
8నా సన్నిధి వెదకుడని నీవు సెలవియ్యగా
–యెహోవా, నీ సన్నిధి నేను వెదకెదనని
నా హృదయము నీతో అనెను.
9నీ ముఖమును నాకు దాచకుము
కోపముచేత నీ సేవకుని తోలివేయకుము.
నా సహాయుడవు నీవే
రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము
నన్ను విడువకుము
10నా తలిదండ్రులు నన్ను విడిచినను
యెహోవా నన్ను చేరదీయును.
11యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము.
నాకొరకు పొంచియున్నవారిని చూచి
సరాళమైన మార్గమున నన్ను నడిపింపుము.
12అబద్ధసాక్షులును క్రూరత్వము వెళ్లగ్రక్కువారును
నా మీదికి లేచియున్నారు.
నా విరోధుల యిచ్ఛకు నన్ను అప్పగింపకుము
13సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదు
నన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును?
14యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము
ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా
నుంచుకొనుము
యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in