YouVersion Logo
Search Icon

కీర్తనలు 26

26
దావీదు కీర్తన.
1యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించు
చున్నాను
నాకు తీర్పు తీర్చుము
ఏమియు సందేహపడకుండ యెహోవాయందు నేను
నమ్మిక యుంచియున్నాను.
2యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షిం
చుము
నా అంతరింద్రియములను నా హృదయమును పరిశో
ధించుము.
3నీ కృప నా కన్నులయెదుట నుంచుకొనియున్నాను
నీ సత్యము ననుసరించి నడుచుకొనుచున్నాను
4పనికిమాలినవారితో నేను సాంగత్యముచేయను
వేషధారులతో పొందుచేయను.
5దుష్టుల సంఘము నాకు అసహ్యము
భక్తిహీనులతో సాంగత్యముచేయను
6నిర్దోషినని నా చేతులు కడుగుకొందును
యెహోవా, నీ బలిపీఠముచుట్టు ప్రదక్షిణము చేయుదును.
7అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును.
నీ ఆశ్చర్యకార్యములను వివరింతును.
8యెహోవా, నీ నివాసమందిరమును
నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించు
చున్నాను.
9పాపులతో నా ప్రాణమును చేర్చకుము
నరహంతకులతో నా జీవమును చేర్చకుము.
10వారి చేతిలో దుష్కార్యములు కలవువారి కుడిచెయ్యి లంచములతో నిండియున్నది.
11నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను
నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము.
12సమభూమిలో నా పాదము నిలిపియున్నాను
సమాజములలో యెహోవాను స్తుతించెదను.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for కీర్తనలు 26