యేసుతో ముఖాముఖి预览

యేసుతో ముఖాముఖి

40天中的第7天

యెహోషువా ఇశ్రాయేలీయుల నాయకత్వమంతటి లోనూ మోషేను చాలా దగ్గరగా వెంబడించాడు. అతడు గుడారం వెలుపల మరియు దేవుని పర్వతం క్రింద మోషే కోసం క్రమం తప్పకుండా వేచి ఉన్నాడు. ఈ నిరీక్షణ మరియు గమనించే ఈ సమయాలు వారినందరినీ నడిపించిన దేవుని పట్ల అతనిలో లోతైన గౌరవాన్ని సృష్టించాయి. మోషే మరణానంతరం దేవుడు యెహోషువతో మాత్రమే మాట్లాడాడు,మరియు మోషేకు తోడుగా ఉన్న కారణంగా శక్తివంతంగానూ ధైర్యంగానూ ఉండాలని యెహోషువాను ప్రోత్సహించాడు.

వాగ్దానం చేయబడిన దేశంలోనికి వారిని నడిపించడం మరియు వారిని స్థిరపచరచడం వంటి ఉన్నతమైన కర్తవ్యంతో అనేక మంది మనుష్యుల కొత్త నాయకునికి ఎంతటి భరోసా! దేవునికి విధేయత చూపడంలో యెహోషువాను ఎప్పుడూ వెనుకాడడు మరియు ఈ విధేయత అతనిని గుంపు నుండి వేరు చేసింది (యొఫున్నే జెఫున్నె కుమారుడు కాలేబుతో పాటు).

దేవుడు యెహోషువాకు తిరిగి తిరిగి ఇచ్చిన హెచ్చరిక - ధర్మశాస్త్ర గ్రంథం అతని నుండి దూరంగా ఉండకూడదు. దేవుడు మోషేకు అనేక ఆజ్ఞలు (పది ఆజ్ఞలు కాకుండా) ఇచ్చాడు కాబట్టి ఆ ఆజ్ఞ చాలా భారమైనది. ఈ ఆజ్ఞలు,దేవునితో సంబంధం ద్వారా ఒకరి జీవితంలోనికి ఇమిడిపోయినట్లయితే,జీవించడం సులభం అవుతుంది. మనం ఎవరినైనా ప్రేమిస్తున్నప్పుడు వారికి నచ్చినది చేస్తాం మరియు అది ఒక కర్తవ్యంగా ఉండదు. దేవునితో మన ప్రయాణంలో కూడా ఇది భిన్నమైనదేమీ కాదు. మనకు ఉన్న దానంతటిలోనూ మరియు ఉన్నవాటితోనూ,మనం ఉన్న విధంగానూ ఆయనను ప్రేమిస్తున్నప్పుడు,ఆయన మాటకు లోబడి,ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించడం భారం కాదు.

మిమ్ములను మీరు ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలు:
నేను దేవుని గాఢంగా ప్రేమిస్తున్నానా?
ఆయన వ్రాసిన మాట ప్రకారం నేను జీవిస్తానా?
నా జీవితంలో భయం ప్రధానంగా ఉండే ప్రాంతం ఉందా?దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను "బలంగా మరియు ధైర్యంగా" ఉండాలని నాకు గుర్తు చేసుకోవాలా?

读经计划介绍

యేసుతో ముఖాముఖి

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్థాయిలో యేసుతో సమయాన్ని అనుభవించుటకు నడిపించే దేవుని వాక్యముతో ఈ 40 రోజులూ ప్రతి దినం కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు అని మా నిరీక్షణ.

More