యేసుతో ముఖాముఖి预览

యేసుతో ముఖాముఖి

40天中的第6天

మోషే మరియు దేవుని మధ్య సంబంధం సీనాయి పర్వతం మీద ప్రారంభమైంది,అక్కడ మోషే తన గొర్రెలను కాస్తూ ఉన్నాడు. మండే పొద వద్ద మొదలైన ఈ సంబంధం తరువాత నలభై సంవత్సరాలు కొనసాగింది మరియు సన్నిహితంగా వృద్ధి చెందింది. దేవుడు మోషేతో స్నేహితుడిలా మాట్లాడాడు అని బైబిలు చెపుతోంది. వారు చేసిన మొదటి సంభాషణలో మోషే భిన్నముగానూ,భయంగానూ ఉన్నట్టు గుర్తించబడింది,అయితే అతడు ఎవరో మరియు అతడు ఏమి చేస్తాడో దేవుడు స్థిరపరచాడు. దేవుడు మోషే యొక్క ప్రశ్నలకు సూటిగా సమాధానమివ్వదు,అయితే తన ఆలోచనలను అతని ఆలోచనల కంటే మరియు ఆయన మార్గాలను అతని మార్గాల కంటే ఉంచేలా స్పష్టంగా ప్రతిస్పందించడం చాలా ఆసక్తికరమైన అంశం.

సంవత్సరాలు జరుగుతూ ఉండగా,తనతో సన్నిహిత సహవాసానికి దేవుని మోషేని పిలిచాడు. అయితే మోషే దేవుని యొక్క పరిశుద్ధత మరియు మహిమను గురించిన లక్ష్యాన్ని ఎన్నడు కోల్పోలేదు. మోషే దేవునితో చాలా సమయం గడిపాడు తద్వారా అతని రూపురేఖలు మారిపోయాయి మరియు అతని ముఖంలోని తేజస్సును దాచడానికి అతడు ముసుగు ధరించవలసి వచ్చింది. అతడు వాగ్దానం చేయబడిన దేశం లోనికి ప్రవేశించలేనప్పటికీ,దేవుని మాటకు వ్యతిరేకంగా అతడు చేసిన తిరుగుబాటు కారణంగా,అతడు మరణించాడు మరియు దేవుని చేత సమాధి చేయబడ్డాడు! ఎంత గౌరవం! వారి సాన్నిహిత్యానికి ఎంత నిదర్శనం!

నన్ను నేనే అడుగుకొనవలసిన ప్రశ్నలు:
నేను దేవుణ్ణి ఏ ప్రశ్నలు అడుగుచూ ఉండాలి?
నేను దేవునితో సమయం గడపడానికి ప్రయత్నం చేస్తున్నానా?
దేవునితో నా సమయాలు నన్ను రూపాంతరం చెందేలా చేస్తున్నాయా?

读经计划介绍

యేసుతో ముఖాముఖి

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్థాయిలో యేసుతో సమయాన్ని అనుభవించుటకు నడిపించే దేవుని వాక్యముతో ఈ 40 రోజులూ ప్రతి దినం కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు అని మా నిరీక్షణ.

More