YouVersion Logo
Search Icon

యేసుతో ముఖాముఖిSample

యేసుతో ముఖాముఖి

DAY 39 OF 40

యేసు పిలాతు ముందు నిలబడ్డాడు,అతడు శిక్ష విధించడంలోఎక్కువగా పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాడు. యేసును తిరిగి ప్రశ్నిస్తున్నప్పుడు నీవు రాజువా అని యేసును అడిగాడు మరియు యేసు తాను సత్యానికి సాక్ష్యమివ్వడానికి భూమి మీదకు వచ్చానని మరియు సత్యం వైపు ఉన్న ప్రతి ఒక్కరూ తన మాట వింటారని సమాధానం ఇచ్చాడు. పిలాతు ప్రతిస్పందిస్తూ "సత్యం అంటే ఏమిటి?"అని యేసును అడిగాడు.మనలో ప్రతి ఒక్కరిని అదే ప్రశ్న అడిగితే,మనకు లభించే సమాధానాల గురించి ఆలోచించండి. మనం సంపూర్ణాలు లేని లోకంలో జీవిస్తున్నాం. బూడిద రంగు సురక్షితమైనదిగా భావించినందున ఏదీ నలుపు కాదూ మరియు ఏదీ తెలుపు కాదు. ఎప్పటికప్పుడు మారుతున్న వాస్తవాలతో అస్పష్టమైన సంస్కృతి కారణంగా సత్యం పలుచబడి పొగమంచుగా మారింది. నిజం అయితే ఒక వ్యక్తి.

సత్యం ఒక వ్యక్తి. యేసే మార్గము,సత్యము మరియు జీవము. యేసును వ్యక్తిగతంగా తెలుసుకున్న తరువాత,ఆయనమన జీవితంలోని వివిధ భాగాలను మార్చడం మరియు దానిని ఆయనతో ఐక్యం చేయడం ప్రారంభించాడు. ఈ ఐక్యత సన్నిహితమైనది మరియు సేంద్రీయమైనది,మనం యేసులాగా ఆలోచించడం ప్రారంభిస్తాము,మనం ఆయనలా వ్యవహరించడం ప్రారంభిస్తాము మరియు ఆయనలా ఇతరులను చూడటం ప్రారంభిస్తాము. మనం ఎప్పుడూ ఒకేలా ఉండము- ఎందుకంటే సత్యం మనలను నిజంగా జీవించడానికి స్వేచ్ఛనిచ్చింది!

దేవుడు మిమ్మల్ని ఎక్కడ ఉంచాడో అక్కడే సంపూర్ణత,సమగ్రత మరియు ప్రభావంతో కూడిన జీవితాన్ని గడపడం.

మిమ్మల్ని మీరు ప్రశ్నించవలసిన ప్రశ్నలు:
నేను దేవుని ముందు యదార్ధంగా ఉన్నానా?
ఆయన మాటలోని సత్యం నా జీవితాన్ని తీర్చిదిద్దుతుందా లేక సంస్కృతి నా జీవితాన్ని తీర్చిదిద్దుతుందా?

About this Plan

యేసుతో ముఖాముఖి

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్థాయిలో యేసుతో సమయాన్ని అనుభవించుటకు నడిపించే దేవుని వాక్యముతో ఈ 40 రోజులూ ప్రతి దినం కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు అని మా నిరీక్షణ.

More