దేవుడు మనతో ఉన్నాడు - ఒక ఆగమనం బైబిలు ప్రణాళికSample

లూకా సువార్త
మనలను రక్షించడానికి దేవుడు మనతో ఉన్నాడు
మాక్స్ లుకాడో ఇలా చెప్పాడు, “తన పిల్లలను రక్షించడానికి దేవుని ప్రణాలికను ప్రకటించడమే బైబిలు ఉద్దేశ్యం. మానవుడు నశించిపోయాడనీ, అతడు రక్షింపబడవలసిన అవసరం ఉందనీ స్థిరంగా చెపుతుంది. తన పిల్లలను రక్షించడానికి ప్రభువైన యేసు శరీరధారిగా పంపబడిన సందేశాన్ని దేవుని వాక్యం, బైబిలు తెలియజేస్తుంది.”
ప్రభువైన యేసు ఈ లోకానికి రావడం గురించిన సమస్తమూ ఆయన మనలను రక్షించాలనే ఆశ చుట్టూనే పరిభ్రమిస్తుంది. వాగ్దానం చేయబడిన మెస్సీయను కలుసుకొన్న వేరువేరు వ్యక్తులను గురించి రచయిత లూకా నమోదు చేశాడు. యేసు తల్లి మరియ ప్రభువు జననం, పెంపకం గురించిన ఆదేశాలనూ అంగీకరించింది. ఆమె తన కీర్తనలో దేవుణ్ణి ఘనపరుస్తుంది. యూదా ప్రజలకు ఆయన తీసుకు రాబోతున్న రక్షణకై కృతజ్ఞత తెలియచేస్తుంది. బాప్తిస్మమిచ్చు యోహాను తండ్రి, జెకర్యా రాబోతున్న మెస్సీయను స్తుతిస్తూ విజయంతో ఆనందిస్తున్నాడు, ఈ మెస్సీయ తన ప్రజలకు రక్షణను తీసుకొని వస్తాడు, వారికి తన దయను చూపిస్తాడు. దేవాలయంలో శిశువైన యేసును చూసిన సుమియోను యూదులకూ, అన్యజనులకూ అందుబాటులో ఉన్న ఆయన రక్షణకోసం దేవుణ్ణి స్తుతిస్తున్నాడు.
“రక్షణ”అనే పదం చుట్టూ అంత అధికమైన ప్రాధాన్యతా, ప్రాధాన్యతా ఉందని మీరు ఆశ్చర్యపోవచ్చు. నీకూ రక్షించబడవలసిన అవసరం ఉందా? అది అంత ప్రాముఖ్యమా? మనమందరం పాపం చేసాము, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నామని లేఖనాలు స్పష్టంగా చెపుతున్నాయి. మనం వ్యభిచారం చేసినా, పొరుగువారితో అబద్దం చెప్పినా, పరీక్షలలో మోసం చేసినా లేదా ఎరుపు రంగు లైటులో ముందుకు వెళ్ళినా మనం అందరమూ పాపులమే. దేవుని దృష్టిలో పాపం పాపమే. మనం ఎంత మంచిగా ఉన్నప్పటికీ మనలో కొన్ని భాగాలు ఇంకా విచ్చిన్నమై ఉన్నాయి, వాటిని సరిచెయ్యవలసిన అవసరం ఉంది.
క్రీస్తులో దేవుని శక్తి మనకు అవసరం అయిన ప్రతీ దానిని సరిచేస్తుంది. మీకు ఎంత సంకల్ప శక్తిఉన్నా, స్వయంసేవ లేదా సానుకూల ఆలోచన ఉన్నా అవి ఈ కార్యాన్ని చేయలేవు. అవి సహాయం చేస్తాయి కాని పూర్తిగా చెయ్యలేవు. - క్రీస్తు తన మరణంలో మనకోసం చిందించిన రక్తం మనం చేసిన పాపాలన్నిటినుండీ, మనం చెయ్యబోయే పాపాలన్నిటినుండీ మనలను శుద్దులనుగా చేస్తుంది. ఇది అత్యద్భుతమైన సంగతి కాదా? యేసు ప్రభువు అని మన నోటితో ఒప్పుకొన్న నిమిషం – మనం రక్షణకోసం ఉద్దేశించబడ్డాము, దానికోసం నిర్ణయించబడ్డాము. అంటే మనం తక్షణమే పరిశుద్దులంగా మారిపోయామని దీని అర్థం కాదు అయితే మనం మన పాపం విషయం గురించీ, దేవుని పరిశుద్ధతను గురించైనా అవగాహనలోనికి తీసుకొని రాబడతాము.
ఈ రెండు వాస్తవాల మధ్యఉన్న గొప్ప విభజనను తగ్గించడంలో సిలువ, దాని కార్యం గురించిన అవగాహనను మనం ఎక్కువగా కలిగియుంటాము. ప్రభువైన యేసు ఇప్పుడు మనలను నీతిమంతులుగా ప్రకటిస్తాడు, మన పాపాలకోసం ఆయన మరణానికి వందనాలు. కాబట్టి ఇది మనల్ని ఏవిధంగా ప్రభావితం చెయ్యవలసి ఉంది? అయితే ఆరంభం కోసం, పాపం విషయంలో శాశ్వతమైన అవాంచిత పరిణామాల నుండి ఆయన మనలను రక్షించాడని మనం కృతజ్ఞతతో జీవించాలి. పశ్చాత్తాపం ఒక జీవనశైలిగా మార్చకోడానికి మనం ప్రయత్నించాలి, అంటే దైనందిన జీవితంలో ఎటువంటి సంకోచం లేకుండా సర్వశక్తిమంతుడైన మన దేవుడు మనలను ప్రేమిస్తున్నాడనీ, మనలను క్షమిస్తాడనీ యెరిగి మన తప్పిదాలను వినయంగా అంగీకరించాలి. పశ్చాత్తాపం లేకుండా క్షమాపణ లేదని గుర్తుంచుకోవడం చాలా అవసరం.
మనల్ని మనం రక్షించుకోవడానికి మనం ఏమీ చేయలేమనీ, అది పూర్తిగా దేవుని మంచితనం, దేవుని కృప ద్వారా మాత్రమే అనే స్థిరబుద్ధితోనూ, స్వేచ్చనిచ్చే వాస్తవంతో జీవించాలి. ఇంకా విముక్తి కలిగించే వాస్తవికతతో జీవించాలి. చివరగా, మనం రక్షించబడడం మన గురించి మాత్రమే కాదు, అయితే ఇతరులను ప్రభువైన యేసు వైపుకు చూపించడం కోసం రక్షించబడ్డాము. ఆయన మనలను రక్షించగలిగినట్లయితే ఆయన వారినీ రక్షించగలడు. వారు ఇంకా దీనిని తెలుసుకోలేకపోవచ్చు, అయితే మన వృత్తాంతమూ, మన పరివర్తనా వారు తెలుసుకొనేలా చెయ్యడానికి ప్రేరణగా ఉండవచ్చు.
మీరు మీ జీవితంలో నూతన సాధారణ స్థితిలో నడుస్తున్నప్పుడు, లోక రక్షకుడు మిమ్మల్ని మీ నుండీ, ఆయన కోసమూ రక్షించాడనే జ్ఞానంలో మీరు ప్రతిదినమూ ఆనందంగా మేల్కొంటారు. మీ కోసం ప్రాణం పెట్టేంత విలువైన వారు. మీకు మీరే చెప్పుకోండి, ఇతరులకూ చెప్పండి! చెప్పండి!
ప్రార్థన:
ప్రియమైన ప్రభువా,
నీ కుమారుడు ప్రభువైన యేసు ద్వారా నన్ను రక్షించినందుకు వందనాలు. ఆలోచనద్వారా గానీ, మాట ద్వారా గానీ లేదా క్రియద్వారా గానీ నేను చేసిన ప్రతీ పాపాన్ని క్షమించమని నిన్ను ప్రార్థిస్తున్నాను. నా జీవితంలో నీవు మరింతగా నాకు కావాలి. నా పట్ల నీకున్న మధురమైన కరుణ, ఉదారమైన కృప నాకు జ్ఞాపకం చెయ్యండి.
నా పట్ల నీ మంచితనానికి నా జీవితం సాక్ష్యం ఇచ్చును గాక
యేసు నామంలో
ఆమేన్.
About this Plan

మనం ప్రపంచం అనిశ్చిత సమయాలలోనూ, తలకిందులైన సమయాలలోనూ ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. మన జీవితాలు దేవుని కుమారుడైన యేసు కోసం కానట్లయితే, మనకు ఎటువంటీ ఆశాభావం ఉండదు. ప్రతి క్రిస్మస్ మనకు ఇమ్మాన్యుయేలును జ్ఞాపకం చేస్తుంది – దేవుడు మనతో ఉండే బహుమతి, ఇస్తూనే ఉన్న బహుమతి. ఇప్పటినుండి శాశ్వతకాలం వరకూ మనం ఎప్పటికీ ఒంటరిగా ఉండము, వేడుకచేసుకోవడం ఎంతైనా యోగ్యమైనదే.
More
Related Plans

Bible Explorer for the Young (Jeremiah - Part 1)

Know You Will 3-Day Devotional by United

Bible Starter Kit

From Seed to Success: A 14-Day Journey of Faith, Growth & Fruit

Thrive: Discovering Joy in the Trenches of Military Life

Permission Granted

Pray for Japan

1 + 2 Thessalonians | Reading Plan + Study Questions

After the Cross
