Bible App logo
Search Icon

ఆది 2

2
1ఈ విదమాడ్ ఆబరున్, బూమిన్, అదవున్ ఎరేకా పురా ఎద్దిన్. 2దెయ్యం ఇదరెకా పనిన్ పురా తిర్పుత్న ఎడొవ దినం అలపుస్తెంద్. 3దెయ్యం ఆ ఎడొవ దినం ఆసిర్వద్ కత్న పవిత్ర దినం కతెంద్. తనుంఙ్ ఇంతే ఆ దినం దెయ్యం తాన్ తయర్ కత్తా పని పురా కత్న పవిత్ర కతెంద్. 4దెయ్యం ఇనెక యెహోవా బూమి, ఆబార్ గడిప్త దినముంఙ్, ఇనంఙ్ అండిన్,
ఎదేన్ వాడి
5భూమి పొయ్ మాకు, సెట్, ల తనయ్ మోలయెతె తనుంఙ్ దెయ్యం యెహోవా బూమి పొదే వనా వర్గలేతిన్. బూమిన్ కేతి కలేకాదుఙ్ ఏ మాన్కకీ తోతేంద్. 6అదుఙి బూమి పొదే ఏ ఈర్ జలల్ కురియుత్ బొక్తె మొలకా తోతేద్; ఏ మాక్ మొలయెతిన్. 7దెయ్యం మల్ల యెహోవా భూమి దుర్రనాడ్ మన్కకున్ ఇదరుత్న అమ్నున్ ముక్కడ్ ఊప్రి ఊద్తేంద్. ఆ విదమడ్ మన్కకుంఙ్ పానం వత్తిన్. 8దెయ్యం యెహోవా పొద్కురినా వై భూమి పొదె ఏదెను ఇనెక జాగత్ ఓకొ వాడి ఇదరుత్న, తాన్ గడిప్తా మన్కకున్ అంతి ఇట్టేంద్. 9దెయ్యం యెహోవా ఒలెంఙ్ సొయ్, తినేకాదున్ సొబతద్ అనేకా పురా రంఙ్లాడ్ పండ్లున్ సియేకా మాకులున్ బూమి పొదే మొలప్తీన్. జీవ మాకులున్, సొయ్ వయ్ట్ కలెకా మాకులున్ గిన ఆ వాడిత్ నడుమున్ మొలప్తిన్. 10ఏదెనుతన ఓకొ నది తుల్సా ఆ వాడిత్ ఈర్ గదిప్తిన్. అత్తి ఆ నది బాగలెత్నా నాలి పెనిక్ ఎద్దె. 11పేలెతద్నె పేర్ పీసోను. అద్ హవీలా దేసెం పురా సుట్టుత్ తూల్సానండిన్. 12అత్తి బఙ్ఙార్ సొయ్తద్. అత్తి సొయ్త దూప్. ముత్యలు, గోమేదిక మణులు గిన రొబడ్నే. 13రెండవ నది గీహోను. అద్ కూసు దేసముత్ పురా తిర్గొరా తుల్సానండద్. 14మూడొవ నదినె పేర్ హిద్దెకెలు. అద్ అష్షూరు దేసమున్ పొద్కురియ్నవై తుల్సనండిన్. నాల్గొవా నది యూప్రటీసు. 15దెయ్యం యెహోవా భూమి మాన్కకున్ ఏదెను వాడిత్ పనికలెంఙ్. సొబనడ్ ఓలేంఙ్ ఇసా అమ్నున్ అత్తి ఇటింన్. 16అంతేయ్ ఎరేకడి, దెయ్యం యెహోవా భూమి పొదె మాన్కకున్ ఇనంఙ్ అగ్య సితిన్; “ఈ వాడిత్ ఏ మాక్నే పంల్నై తినేంఙ్ వంద్. 17గనీ, సొయ్ వయ్ట్ కలెకా మాక్నే పండ్లు మాత్రం తినెం నీవ్ అదున్ తిందా దినం కారేయ్ తిక్సతి ఇసా ఇన్తెంద్” 18దెయ్యం యెహోవా ఇంకా ఇంతిన్. భూమి పొదె “ఈ మాన్కక్ ఒక్కొది అనేకాద్ సొయ్ తొద్. అమ్నుఙ్ సటి లగెక ఇక్కొకొనున్ గడిప్సతున్” 19దెయ్యం యెహోవా, ప్రతి విదంతా ప్రానికున్ భూమి తా జన్వలున్, గాలిత్ తూలెకా ప్రతి రంఙ్లడ్ పిట్టలున్ బూమి పొదే గడిప్తేంద్, అదవున్ మాన్కక్ ఏద పేర్ల ఇడ్సారొ ఓలేంఙ్ సటి అదవున్ మెరా తొడ వాతేర్. కూటె పిట్ట జన్వల్ ప్రతి ఒక్కొదున్ మాన్కకున్ తనే పేల్ ఇట్టేరొ అదవున్ పేర్ ఇట్టేంద్. 20మాన్కకున్ పురా రంఙ్లాడ్ ప్రానికున్ జన్వర్లున్, గాలిత్ తూలెకా పిట్టలున్, పురా రకాలడ్ భూమి జన్వలుంఙ్ గిన పేర్ ఇట్టేంద్ గనీ మాన్కకున్ బారబర్ సంఙ్ ఏరి రొబడేతెర్. 21అప్పుడ్ యెహోవా దెయ్యం భూమి పొదె మాన్కకున్ కుబ్ మాఙ్ఙెకాద్ తయర్ కత్తిన్. అమ్దు మాఙ్సా అనేఙా దెయ్యం అమ్నే పక్కటే బొక్కన్ ఒక్కొదున్ పుసుత్న ఆ బొక్కనే జాగత్ నంజుడున్ ఇట్టేంద్. 22ఆ మాన్కక్ నంతి పుస్తా పక్కటె బొక్కనడ్ యెహోవా దెయ్యం భూమి పొదె ఒక్కొ పిల్లన్ తయర్ కత్తిన్ అదున్ మాన్కకున్ మెరా కొతెంద్. 23భూమి పొదె మన్కక్, “అద్ అన్నెబొక్కత ఒకొ బొక్క, అనే నంజుడుత్ నంజుడ్, ఈదున్ పుస్తాద్ మాన్కక్నంతాద్ ఎద్ ఇసా ఇద్నే పేర్ పిల్లా” ఇన్తెంద్. 24అదుఙి పడ్స తనే బాంద్ అమ్మన్ సయుత్నా తనే మస్నతి పావిడ్సార్. ఔరు ఇద్దరేత్ ఒక్కొది మేన్ కలైయ్సద్. 25అప్పుడ్ భూమి పొదె అమ్నున్, తనే మాస ఇద్దర్నయ్ జగ్గే తోసేట అండర్ గని, ఔరు లాజ్జన్ వరేతెర్.

Currently Selected:

ఆది 2: KP25

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in