Bible App logo
Search Icon

యిర్మీయా 47

47
ఫిలిష్తీయుల గురించిన సందేశం
1ఫరో ఇంకా గాజా మీద దాడిచేయక ముందు ఫిలిష్తీయుల గురించి యిర్మీయా ప్రవక్తకు వచ్చిన యెహోవా వాక్కు:
2యెహోవా ఇలా చెప్తున్నారు:
“ఉత్తరాన జలప్రవాహాలు ఎలా ఎగసిపడుతున్నాయో చూడండి;
అవి వరదలా పొంగి పొర్లిపారుతాయి.
అవి దేశం మీద, అందులో ఉన్న వాటన్నిటి మీద,
పట్టణాల మీద, వాటిలో నివసించేవారి మీద పొర్లిపారుతాయి.
కాబట్టి ప్రజలంతా మొరపెడతారు;
దేశంలో నివసించేవారంతా ఏడుస్తారు.
3పరుగెత్తే గుర్రాల డెక్కల శబ్దానికి,
శత్రు రథాల శబ్దానికి
వాటి చక్రాల శబ్దానికి వారు రోదిస్తారు.
తల్లిదండ్రులు తమ పిల్లలకు సహాయం చేయరు;
వారి చేతులు బలహీనంగా ఉంటాయి.
4ఎందుకంటే ఆ రోజు వచ్చింది,
ఫిలిష్తీయులందరినీ నాశనం చేసే రోజు
తూరు, సీదోనులకు సహాయం చేసేవారందరిని
తొలగించే రోజు తప్పకుండా వస్తుంది.
యెహోవా ఫిలిష్తీయులను,
కఫ్తోరు#47:4 అంటే, క్రేతు తీరాల్లో మిగిలి ఉన్నవారిని నాశనం చేయబోతున్నారు.
5గాజా దుఃఖంలో తల క్షౌరం చేసుకుంటుంది;
అష్కెలోను నిశ్శబ్దం చేయబడుతుంది.
సమతల మైదానంలో మిగిలి ఉన్నవారలారా,
ఎంతకాలం మిమ్మల్ని మీరు గాయపరచుకుంటారు?
6“ ‘అయ్యో, యెహోవా ఖడ్గమా,
నీవు ఎంత కాలానికి విశ్రాంతి తీసుకుంటావు?
నీ ఒర లోనికి తిరిగివెళ్లి
ప్రశాంతంగా విశ్రమించు.’
7అయితే అష్కెలోను మీదా,
సముద్ర తీర ప్రాంతాల మీద దాడి చేయమని,
యెహోవా దాన్ని ఆజ్ఞాపించినప్పుడు,
అది ఎలా విశ్రమిస్తుంది?”

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for యిర్మీయా 47