YouVersion Logo
Search Icon

హోషేయ 3

3
హోషేయ తన భార్యతో సమాధానపడుట
1యెహోవా నాతో, “వెళ్లు, నీ భార్యను వేరే వ్యక్తి ప్రేమించినా, వ్యభిచారిగా ఉన్నా ఆమెకు నీ ప్రేమను చూపించు. ఇశ్రాయేలీయులు ఇతర దేవుళ్ళను పూజించి పవిత్ర ద్రాక్షపండ్ల ముద్దలను ఆశించనప్పటికి, యెహోవా వారిని ప్రేమించినట్లు ఆమెను ప్రేమించు” అని చెప్పారు.
2కాబట్టి నేను పదిహేను వెండి నాణేలు,#3:2 అంటే, 170 గ్రాములు ఒక హోమెరు, ఒక లెతెకు#3:2 ఒక హోమెరు, ఒక లెతెకు అంటే సుమారు 195 కి. గ్రా. లు యవలు ఇచ్చి ఆమెను కొనుక్కున్నాను. 3అప్పుడు ఆమెతో, “నీవు నాతో చాలా కాలం జీవించాలి; నీవు వేశ్యగా ఉండకూడదు, వేరే ఏ పురుషునితో సన్నిహితంగా ఉండకూడదు, అలాగే నేను నీ పట్ల నమ్మకంగా ఉంటాను” అన్నాను.
4ఎందుకంటే ఇశ్రాయేలీయులు చాలా కాలం రాజు గాని పాలకుడు గాని లేకుండా, బలులు గాని పవిత్ర రాళ్లు గాని లేకుండా, ఏఫోదు గాని గృహ దేవుళ్ళు గాని లేకుండా ఉంటారు. 5తర్వాత ఇశ్రాయేలీయులు తిరిగివచ్చి, తమ దేవుడైన యెహోవాను, తమ రాజైన దావీదును వెదుకుతారు. చివరి రోజుల్లో యెహోవా దగ్గరకు, ఆయన దీవెనలు దగ్గరకు వారు వణకుతూ వస్తారు.

Currently Selected:

హోషేయ 3: TSA

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in