Bible App logo
Search Icon

యెహెజ్కేలు 19

19
ఇశ్రాయేలు అధిపతుల గురించి విలాప గీతం
1“నీవు ఇశ్రాయేలీయుల అధిపతుల గురించి విలాప గీతం పాడి ఇలా చెప్పు:
2“ ‘నీ తల్లి ఎలాంటిది అంటే
సింహాల మధ్యలో ఆడసింహం లాంటిది.
కొదమ సింహాల మధ్య పడుకుని
తన పిల్లలను పెంచింది.
3ఆమె వాటిలో ఒకదాన్ని పెంచినప్పుడు
అది బలమైన సింహం అయ్యింది.
అది వేటాడడం నేర్చుకొని
మనుష్యులను తినే జంతువుగా మారింది.
4దాని గురించి ఇతర జనాంగాలు విని
తమ గోతిలో దానిని పట్టుకున్నారు.
దానికి గాలం తగిలించి
ఈజిప్టు దేశానికి తీసుకెళ్లారు.
5“ ‘అది చూసిన దాని తల్లి
తన ఆశ నిరాశ అయ్యిందని
తన పిల్లల్లో మరో దానిని తీసుకుని
బలమైన సింహంగా తయారుచేసింది.
6ఇది కూడా కొదమ సింహమై,
మిగిలిన కొదమ సింహాలతో పాటు తిరుగుతూ
వేటాడడం నేర్చుకొని
మనుష్యులను తినే జంతువుగా మారింది.
7అది వారి బలమైన కోటలను పడగొట్టి
వారి పట్టణాలను పాడుచేసింది.
దాని గర్జన విని
దేశంతో పాటు దేశంలో ఉన్నదంతా పాడైపోయింది.
8నాలుగు వైపుల ఉన్న దేశాల ప్రజలందరూ
దానిని పట్టుకోవడానికి వచ్చి
దాని కోసం తమ వలలు పన్ని
తమ గోతిలో దానిని చిక్కించుకున్నారు.
9దానికి గాలం తగిలించి బోనులో పెట్టి
బబులోను రాజు దగ్గరకు దానిని తీసుకెళ్లారు.
ఇశ్రాయేలీయుల పర్వతాలమీద
దాని గర్జన ఎన్నటికీ వినబడకుండా
వారు దానిని చెరసాలలో ఉంచారు.
10“ ‘నీ తల్లి నీ ద్రాక్షతోటలో నీటి ప్రక్కన
నాటబడిన ద్రాక్షవల్లిలాంటిది;
నీరు సమృద్ధిగా ఉన్నందున
అది ఫలించి అనేక కొమ్మలతో నిండి ఉంది.
11పాలకుల రాజదండాన్ని చేయడానికి తగిన
బలమైన కొమ్మలు దానికున్నాయి.
అది మేఘాలను తాకే అంతగా
పైకి పెరిగింది
దానికున్న అనేక కొమ్మలతో
ఏపుగా పెరిగింది.
12అయితే మహా కోపంతో అది పెరికి వేయబడి
నేల మీద పారవేయబడింది.
తూర్పు గాలి వీచగా
దాని పండ్లు వాడిపోయాయి;
బలమైన దాని కొమ్మలు
అగ్నిలో పడి కాలిపోయాయి.
13ఇప్పుడది అరణ్యంలో పూర్తిగా ఎండిపోయిన
నీళ్లు లేని ఎడారిలో నాటబడింది.
14దాని కొమ్మల్లో నుండి అగ్ని వ్యాపించి
దాని పండ్లను కాల్చివేసింది.
పాలకుల రాజదండాన్ని చేయడానికి తగిన
బలమైన కొమ్మ ఒక్కటి కూడా మిగల్లేదు.’
ఇదే విలాప వాక్యం; దీనినే విలాప గీతంగా పాడతారు.”

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in