YouVersion Logo
Search Icon

యోబు 12

12
తన స్నేహితులకు యోబు జవాబు
1అప్పుడు యోబు జోఫరుకు ఇలా జవాబు ఇచ్చాడు:
2“సందేహము లేకుండ, మీరు మాత్రమే
జ్ఞానం గల వాళ్లని మీరు తలస్తారు.
మీరు చనిపోయినప్పుడు మీతో బాటు
జ్ఞానం గతిస్తుందని మీరు తలస్తారు.
3అయితే మీరు ఎంత జ్ఞానంగలవాళ్లో నేనూ అంత జ్ఞానంగలవాడిని.
నేను మీకంటే తక్కువేమి కాదు.
ఇది సత్యం అని ఇతరులకు కూడా తెలుసు.
4“ఇప్పుడు నా స్నేహితులు నన్ను చూసి నవ్వుతారు.
వారిలా అంటారు: ‘వీడు దేవుణ్ణి ప్రార్థించాడు. వీనికి ఆయన జవాబు ఇచ్చాడు.’
కానీ నేను మంచివాణ్ణి, నిర్దోషిని.
అయినప్పటికీ ఇంకా నన్ను చూసి నా స్నేహితులు నవ్వుతూనే ఉన్నారు.
5కష్టాలు లేని మనుష్యులు కష్టాలు ఉన్న వాళ్లను హేళన చేస్తారు.
అలాంటి వాళ్లు పడిపోతున్న వాళ్లను కొట్టేస్తారు.
6దొంగల గుడారాలకు ఇబ్బంది లేదు.
దేవునికి కోపం రప్పించే వాళ్లు శాంతిగా జీవిస్తారు.
వారి ఒకే దేవుడు వారి స్వంత బలమే.
7“అయితే జంతువుల్ని అడగండి,
అవి మీకు నేర్పిస్తాయి.
లేక ఆకాశ పక్షుల్ని అడగండి,
అవి మీకు నేర్పిస్తాయి.
8లేక భూమితో మాట్లాడండి,
అది మీకు నేర్పిస్తుంది.
లేక సముద్రపు చేపలను వాటి జ్ఞానం గూర్చి
మీతో చెప్పనివ్వండి.
9వాటిని యెహోవా సృష్టించాడని ప్రతి ఒక్కరికీ తెలుసు.
10బ్రతికి ఉన్న ప్రతి జంతువూ శ్వాస పీల్చే
ప్రతి మనిషీ దేవుని శక్తి క్రిందనే.
11భోజనం రుచి చూడడం నాలుకకు ఎంత ఆనందమో
చెవులు అవి వినే మాటలను పరీక్షించవా:
12ముసలి వాళ్లకు కూడా జ్ఞానం ఉంది. దీర్ఘాయుష్షు అవగాహన కలిగిస్తుంది.
అని మేము అన్నాము.
13జ్ఞానం, బలం దేవునికి చెందుతాయి.
మంచి సలహా మరియు గ్రహింపు ఆయనవే.
14ఒక వేళ దేవుడు దేనినైనా పడగొడితే మనుష్యులు దాన్ని తిరిగి నిర్మించలేరు.
ఒక వేళ దేవుడు ఒక మనిషిని చెరసాలలో పెడితే మనుష్యులు అతనిని విడుదల చేయలేరు.
15ఒక వేళ దేవుడు గాని వర్షాన్ని ఆపివేస్తే భూమి ఎండి పోతుంది.
ఒక వేళ దేవుడు గాని వర్షాన్నిరానిస్తే అది భూమిని వరదతో నింపివేస్తుంది.
16దేవుడు బలవంతుడు, ఆయన ఎల్లప్పుడూ గెలుస్తాడు.
మోసపోయిన వాడు మోసం చేసిన వారూ ఇద్దరూ దేవునికి చెందిన వారే.
17రాజుల జ్ఞానమును దేవుడు తీసి వేస్తాడు.
నాయకులు వెర్రిగా వ్రవర్తించేటట్టు చేస్తాడు.
18రాజులు వారి బందీలకు గొలుసులు వేస్తారు. కాని దేవుడు వాటిని తీసివేస్తాడు.
అప్పుడు దేవుడు ఆ రాజుల మీద నడికట్టు వేస్తాడు.
19తన వంశాన్ననుసరించి రక్షణ ఉందనుకొనే యాజకుల బలాన్ని దేవుడు అణచి,
వాళ్లను క్రిందికి దిగజారేటట్లు చేస్తాడు.
20నమ్మకమైన సలహాదారులను దేవుడు నిశ్శబ్దం చేస్తాడు.
వృద్ధుల జ్ఞానమును ఆయన తీసివేస్తాడు.
21నాయకులను అప్రముఖులనుగా చేస్తాడు.
పాలకుల బలాన్ని ఆయన తీసివేస్తాడు.
22లోతైన అంధకారంలో నుండి రహస్య సత్యాలను దేవుడు చూపిస్తాడు.
మరణం లాంటి చీకటి గల స్థలాలలోనికి ఆయన వెలుగు పంపిస్తాడు.
23దేవుడు రాజ్యాలను పెద్దవిగా, శక్తిగలవిగా విస్తరింపజేస్తాడు.
అప్పుడు ఆయన వాటిని నాశనం చేస్తాడు.
ఆయన రాజ్యాలను పెద్దవిగా పెరగనిస్తాడు.
అప్పుడు ఆ రాజ్యాల్లోని ప్రజలను ఆయన చెదరగొడతాడు.
24భూలోక నాయకులను వెర్రివార్ని గాను అర్థం చేసుకోలేని వార్ని గాను దేవుడు చేస్తాడు.
మార్గం లేని అరణ్యంలో సంచరించేందుకు ఆయన వారిని పంపిస్తాడు.
25ఆ నాయకులు చీకటిలో ముందుకు సాగుతారు. వారికి ఏ వెలుగూ లేదు.
వారు తాగుబోతుల్లా నడిచేటట్టు దేవుడు వారిని చేస్తాడు.”

Currently Selected:

యోబు 12: TERV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in