YouVersion Logo
Search Icon

పరమగీతము 8

8
1నా తల్లియొద్ద స్తన్యపానము చేసిన యొక సహోదరుని
వలె
నీవు నాయెడలనుండిన నెంతమేలు!
అప్పుడు నేను బయట నీకు ఎదురై
ముద్దులిడుదును
ఎవరును నన్ను నిందింపరు.
2నేను నీకు మార్గదర్శినౌదును
నా తల్లియింట చేర్చుదును
నీవు నాకు ఉపదేశము చెప్పుదువు
సంభార సమ్మిళిత ద్రాక్షారసమును
నా దాడిమఫలరసమును నేను నీకిత్తును.
3అతని యెడమచెయ్యి నా తలక్రింద నున్నది
అతని కుడిచెయ్యి నన్ను కౌగిలించుచున్నది
4యెరూషలేము కుమార్తెలారా,
లేచుటకు ప్రేమకు ఇచ్ఛపుట్టువరకు
లేపకయు కలతపరచకయు నుందుమని
నేను మీచేత ప్రమాణము చేయించుకొందును.
5తన ప్రియునిమీద ఆనుకొని
అరణ్యమార్గమున వచ్చునది ఎవతె?
జల్దరువృక్షము క్రింద నేను నిన్ను లేపితిని
అచ్చట నీ తల్లికి నీవలన ప్రసవవేదన కలిగెను
నిన్ను కనిన తల్లి యిచ్చటనే ప్రసవవేదన పడెను.
6ప్రేమ మరణమంత బలవంతమైనది
ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది
దాని జ్వాలలు అగ్నిజ్వాలా సమములు
అది యెహోవా పుట్టించు జ్వాల
నీ హృదయముమీద నన్ను నామాక్షరముగా
ఉంచుము
నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము.
7అగాధసముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు
నదీ ప్రవాహములు దాని ముంచివేయజాలవు
ప్రేమకై యొకడు తన స్వాస్థ్యమంత ఇచ్చినను
తిరస్కారముతో అతడు త్రోసివేయబడును.
8మాకొక చిన్న చెల్లెలు కలదు
దానికి ఇంకను వయస్సు రాలేదు
వివాహకాలము వచ్చినప్పుడు
మేము దానివిషయమై యేమి చేయుదుము?
9అది ప్రాకారమువంటిదాయెనా?
మేము దానిపైన వెండి గోపురమొకటి కట్టుదుము.
అది కవాటమువంటిదాయెనా?
దేవదారు మ్రానుతో దానికి అడ్డులను కట్టుదుము
10నేను ప్రాకారమువంటిదాననైతిని
నా కుచములు దుర్గములాయెను
అందువలన అతనిదృష్టికి
నేను క్షేమము నొందదగినదాననైతిని.
11బయలు హామోనునందు
సొలొమోను కొక ద్రాక్షావనము కలదు
అతడు దానిని కాపులకిచ్చెను
దాని ఫలములకు వచ్చుబడిగా
ఒక్కొక్కడు వేయి రూపాయిలు తేవలెను.
12నా ద్రాక్షావనము నా వశమున ఉన్నది
సొలొమోనూ, ఆ వేయి రూపాయిలు నీకే చెల్లును.
దానిని కాపుచేయువారికి రెండువందలు వచ్చును.
13ఉద్యానవనములలో పెంచబడినదానా,
నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు
నన్నును దాని విననిమ్ము.
14నా ప్రియుడా, త్వరపడుము
లఘువైన యిఱ్ఱివలె ఉండుము
గంధవర్గవృక్ష పర్వతములమీద
గంతులువేయు లేడిపిల్లవలె ఉండుము.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy