YouVersion Logo
Search Icon

పరమగీతము 2

2
1నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి
దానను
లోయలలో పుట్టు పద్మమువంటిదానను.
2బలురక్కసి చెట్లలో వల్లిపద్మము కనబడునట్లు
స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది.
3అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో
పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు
ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని
అతని ఫలము నా జిహ్వకు మధురము.
4అతడు నన్ను విందుశాలకు తోడుకొనిపోయెను
నామీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను.
5ప్రేమాతిశయముచేత నేను మూర్ఛిల్లుచున్నాను
ద్రాక్షపండ్ల యడలుపెట్టి నన్ను బలపరచుడి
జల్దరు పండ్లుపెట్టి నన్నాదరించుడి
6అతని యెడమచెయ్యి నా తలక్రిందనున్నది
కుడిచేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు.
7యెరూషలేము కుమార్తెలారా,
పొలములోని యిఱ్ఱులనుబట్టియు లేళ్లనుబట్టియు
మీచేత ప్రమాణము చేయించుకొని
ప్రేమకు ఇష్టమగువరకు
మీరు లేపకయు కలతపరచకయు
నుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.
8ఆలకించుడి; నా ప్రియుని స్వరము వినబడుచున్నది
ఇదిగో అతడు వచ్చుచున్నాడు
గంతులువేయుచు కొండలమీదను ఎగసిదాటుచు
మెట్టలమీదను అతడు వచ్చుచున్నాడు.
9నా ప్రియుడు ఇఱ్ఱివలె నున్నాడు
లేడిపిల్లవలె నున్నాడు
అదిగో మన గోడకు వెలిగా నతడు నిలుచుచున్నాడు
కిటికీగుండ చూచుచున్నాడు
కిటికీకంతగుండ తొంగి చూచుచున్నాడు
10ఇప్పుడు నా ప్రియుడు నాతో మాటలాడు
చున్నాడు
11నా ప్రియురాలా, సుందరవతీ, లెమ్ము రమ్ము
చలికాలము గడిచిపోయెను
వర్షకాలము తీరిపోయెను వర్షమిక రాదు.
12దేశమంతట పువ్వులు పూసియున్నవి
పిట్టలు కోలాహలముచేయు కాలము వచ్చెను
పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది.
13అంజూరపుకాయలు పక్వమగుచున్నవి
ద్రాక్షచెట్లు పూతపెట్టి సువాసన నిచ్చుచున్నవి
నా ప్రియురాలా, సుందరవతీ, లెమ్ము రమ్ము
14బండసందులలో ఎగురు నా పావురమా,
పేటుబీటల నాశ్రయించు నా పావురమా,
నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము
నీ ముఖము నాకు కనబడనిమ్ము
నీ స్వరము నాకు వినబడనిమ్ము.
15మన ద్రాక్షతోటలు పూతపెట్టియున్నవి
ద్రాక్షతోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి
సహాయము చేసి గుంటనక్కలను పట్టుకొనుడి.
16నా ప్రియుడు నా వాడు నేను అతనిదానను
పద్మములున్నచోట అతడు మందను మేపుచున్నాడు
17చల్లనిగాలి వీచువరకు నీడలు లేకపోవువరకు
ఇఱ్ఱివలెను లేడిపిల్లవలెను కొండబాటలమీద త్వరపడి
రమ్ము.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy