YouVersion Logo
Search Icon

రోమా 10

10
1సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణపొంద వలెనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికిచేయు ప్రార్థనయునై యున్నవి. 2వారు దేవునియందు ఆసక్తిగలవారని వారినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను; అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. 3ఏలయనగా వారు దేవుని నీతినెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడ లేదు. 4విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియై యున్నాడు. 5ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దానివలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు. 6-7అయితే విశ్వాసమూలమగు నీతి యీలాగు చెప్పుచున్నది–ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును? అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు; లేక –ఎవడు అగాధములోనికి దిగిపోవును? అనగా క్రీస్తును మృతులలోనుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు. 8అదేమని చెప్పుచున్నది? – వాక్యము నీయొద్దను, నీ నోటను నీ హృదయములోను
ఉన్నది; అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే. 9అదేమనగా–యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. 10ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. 11ఏమనగా, ఆయనయందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. 12యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యుండి, తనకు ప్రార్థనచేయువారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు. 13ఎందుకనగా–
ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడో
వాడు రక్షింపబడును.
14వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడులేకుండ వారెట్లు విందురు? 15ప్రకటించువారు పంప బడని యెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై–
ఉత్తమమైనవాటినిగూర్చిన సువార్త ప్రకటించువారి
పాదములెంతో సుందరమైనవి
అని వ్రాయబడి యున్నది
16అయినను అందరు సువార్తకు లోబడలేదు–
ప్రభువా, మేము తెలియజేసిన సమాచారమెవడు
నమ్మెను
అని యెషయా చెప్పుచున్నాడు గదా? 17కాగా వినుటవలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తునుగూర్చిన మాటవలన కలుగును. 18అయినను నేను చెప్పునదేమనగా, వారు వినలేదా? విన్నారు గదా?
వారి స్వరము భూలోకమందంతటికిని, వారిమాటలు
భూదిగంతములవరకును బయలువెళ్లెను.
19మరియు నేను చెప్పునదేమనగా ఇశ్రాయేలునకు తెలియకుండెనా?
జనము కానివారివలన మీకు రోషము పుట్టించెదను,
అవివేకమైన జనమువలన మీకు ఆగ్రహము కలుగ
జేతును
అని మొదట మోషే చెప్పుచున్నాడు.
20-21మరియు యెషయా తెగించి
–నన్ను వెదకనివారికి నేను దొరకితిని; నన్ను విచా
రింపనివారికి ప్రత్యక్షమైతిని
అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే–
అవిధేయులై యెదురాడు ప్రజలకు నేను దినమంతయు
నా చేతులు చాచితిని
అని చెప్పుచున్నాడు.

Currently Selected:

రోమా 10: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy