YouVersion Logo
Search Icon

కీర్తనలు 67

67
ప్రధానగాయకునికి. తంతివాద్యములతో పాడదగినది. గీతము.
1భూమిమీద నీ మార్గము తెలియబడునట్లును
అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లును
2దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక
ఆయన తన ముఖకాంతి మామీద ప్రకాశింపజేయును
గాక. (సెలా.)
3దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక.
ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక.
న్యాయమునుబట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు
భూమిమీదనున్న జనములను ఏలెదవు. (సెలా.)
4జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును
గాక
5దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక.
ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక.
6అప్పుడు భూమి దాని ఫలములిచ్చును
దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును.
7దేవుడు మమ్మును దీవించును
భూదిగంత నివాసులందరు ఆయనయందు భయభక్తులు నిలుపుదురు.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for కీర్తనలు 67