YouVersion Logo
Search Icon

కీర్తనలు 6

6
ప్రధాన గాయకునికి. అష్టమశృతిమీద తంతివాద్యములతో పాడదగినది. దావీదు కీర్తన.
1యెహోవా, నీ కోపముచేత నన్ను గద్దింపకుము
నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము.
2యెహోవా, నేను కృశించియున్నాను, నన్ను
కరుణించుము
యెహోవా, నా యెముకలు అదరుచున్నవి, నన్ను
బాగుచేయుము
3నా ప్రాణము బహుగా అదరుచున్నది.
యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక యుందువు?
4యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము
నీ కృపనుబట్టి నన్ను రక్షించుము.
5మరణమైనవారికి నిన్నుగూర్చిన జ్ఞాపకము లేదు
పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుదురు?
6నేను మూలుగుచు అలసియున్నాను
ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను.
నా కన్నీళ్లచేత నా పడక కొట్టుకొని పోవుచున్నది.
7విచారముచేత నా కన్నులు గుంటలు పడుచున్నవి
నాకు బాధ కలిగించువారిచేత అవి చివికియున్నవి.
8యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు
పాపముచేయువారలారా, మీరందరు నాయొద్దనుండి
తొలగిపోవుడి.
9యెహోవా నా విన్నపము ఆలకించియున్నాడు
యెహోవా నా ప్రార్థన నంగీకరించును.
10నా శత్రువులందరు సిగ్గుపడి బహుగా అదరుచున్నారువారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్లుదురు.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for కీర్తనలు 6