YouVersion Logo
Search Icon

కీర్తనలు 3

3
అబ్షాలోమను తన కుమారుని యెదుటనుండి పారిపోయి నప్పుడు దావీదు రచించిన కీర్తన.
1యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించియున్నారు
నామీదికి లేచువారు అనేకులు.
2–దేవుని వలన అతనికి రక్షణ యేమియు దొరకదని
నన్నుగూర్చి చెప్పువారు అనేకులు (సెలా.)
3యెహోవా, నీవే నాకు కేడెముగాను
నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు.
4ఎలుగెత్తి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టునప్పుడు
ఆయన తన పరిశుద్ధపర్వతమునుండి నాకు ఉత్తరమిచ్చును.
5యెహోవా నాకు ఆధారము,
కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును
6పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహ
రించినను నేను భయపడను
7యెహోవా, లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము
నా శత్రువులనందరిని దవడ యెముకమీద కొట్టు
వాడవు నీవే, దుష్టుల పళ్లు విరుగగొట్టువాడవు నీవే.
8రక్షణ యెహోవాది
నీ ప్రజలమీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. (సెలా.)

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for కీర్తనలు 3