YouVersion Logo
Search Icon

కీర్తనలు 19

19
ప్రధానగాయకునికి. దావీదు కీర్తన.
1ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి
అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.
2పగటికి పగలు బోధచేయుచున్నది.
రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది.
3వాటికి భాషలేదు మాటలులేవు వాటి స్వరము విన
బడదు.
4వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించి
యున్నది
లోకదిగంతములవరకు వాటి ప్రకటనలు బయలువెళ్లుచున్నవి
వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను.
5అతడు తన అంతఃపురములోనుండి బయలుదేరు పెండ్లి
కుమారుని వలె ఉన్నాడు
శూరుడు పరుగెత్త నుల్లిసించునట్లు తన పథమునందు
పరుగెత్త నుల్లిసించుచున్నాడు.
6అతడు ఆకాశమున ఈ దిక్కునుండి బయలుదేరి ఆ
దిక్కువరకు దానిచుట్టు తిరిగి వచ్చుచున్నాడు
అతని వేడిమికి మరుగైనది ఏదియు లేదు.
7యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థ
మైనది
అది ప్రాణమును తెప్పరిల్లజేయును
యెహోవా శాసనము నమ్మదగినది
అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును.
8యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి
హృదయమును సంతోషపరచును
యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది
కన్నులకు వెలుగిచ్చును.
9యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది
నిత్యము నిలుచును
యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవ
లము న్యాయమైనవి.
10అవి బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారు
కంటెను కోరదగినవి
తేనెకంటెను జుంటితేనెధారలకంటెను మధురమైనవి.
11వాటివలన నీ సేవకుడు హెచ్చరిక నొందును
వాటిని గైకొనుటవలన గొప్ప లాభము కలుగును.
12తన పొరపాటులు కనుగొనగలవాడెవడు?
నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను
నిర్దోషినిగా తీర్చుము.
13దురభిమాన పాపములలో పడకుండ నీ సేవకుని
ఆపుము, వాటిని నన్ను ఏలనియ్యకుము
అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము
చేయకుండ నిందా రహితుడనగుదును.
14యెహోవా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా,
నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును
నీ దృష్టికి అంగీకారములగును గాక.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy