YouVersion Logo
Search Icon

కీర్తనలు 149

149
1యెహోవాను స్తుతించుడి
యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి
భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర
గీతము పాడుడి.
2ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించినవానినిబట్టి
సంతోషించుదురు గాక
సీయోను జనులు తమ రాజునుబట్టి ఆనందించుదురు గాక.
3నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించు
దురు గాక
తంబురతోను సితారాతోను ఆయననుగూర్చి గానము
చేయుదురు గాక.
4యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు.
ఆయన దీనులను రక్షణతో అలంకరించును.
5భక్తులు ఘనతనొంది ప్రహర్షించుదురు గాకవారు సంతోషభరితులై తమ పడకలమీద ఉత్సాహ
గానము చేయుదురు గాక.
6వారినోట దేవునికి చేయబడు ఉత్సాహస్తోత్రము
లున్నవి.
7అన్యజనులకు ప్రతి దండన చేయుటకును ప్రజలను
శిక్షించుటకును
8గొలుసులతో వారి రాజులను
ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకును
9విధింపబడిన తీర్పు వారిమీద నడుపుటకునువారి చేతిలో రెండంచులుగల ఖడ్గమున్నది.
ఆయన భక్తులకందరికి ఘనత యిదే
యెహోవాను స్తుతించుడి.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for కీర్తనలు 149