YouVersion Logo
Search Icon

కీర్తనలు 146

146
1యెహోవాను స్తుతించుడి.
నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము
2నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించె
దను
నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను
3రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదువారిని నమ్ముకొనకుడి
4వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగు
దురు.వారి సంకల్పములు నాడే నశించును.
5ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో
ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టు
కొనునో వాడు ధన్యుడు
6ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దాని
లోని సర్వమును సృజించినవాడు
ఆయన ఎన్నడును మాట తప్పనివాడు.
7బాధపరచబడువారికి ఆయన న్యాయము తీర్చును
ఆకలిగొనినవారికి ఆహారము దయచేయును
యెహోవా బంధింపబడినవారిని విడుదలచేయును.
8యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు
యెహోవా క్రుంగినవారిని లేవనెత్తువాడు
యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు
9యెహోవా పరదేశులను కాపాడువాడు
ఆయన తండ్రిలేనివారిని విధవరాండ్రను ఆదరించు
వాడు
భక్తిహీనుల మార్గమును ఆయన వంకరమార్గముగా
చేయును.
10యెహోవా నిరంతరము ఏలును
సీయోనూ, నీ దేవుడు తరములన్నిటను రాజ్యము
చేయును
యెహోవాను స్తుతించుడి.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in