YouVersion Logo
Search Icon

కీర్తనలు 112

112
1యెహోవాను స్తుతించుడి
యెహోవాయందు భయభక్తులుగలవాడు
ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు
ధన్యుడు.
2వాని సంతతివారు భూమిమీద బలవంతులగుదురు
యథార్థవంతుల వంశపువారు దీవింపబడుదురు
3కలిమియు సంపదయు వాని యింటనుండును
వాని నీతి నిత్యము నిలుచును.
4యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టునువారు కటాక్షమును వాత్సల్యతయు నీతియుగలవారు.
5దయాళులును అప్పిచ్చువారును భాగ్యవంతులు
న్యాయవిమర్శలో వారి వ్యాజ్యెము గెలుచును
6అట్టివారు ఎప్పుడును కదలింపబడరు
నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు.
7వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిర
ముగానుండును
వాడు దుర్వార్తకు జడియడు.
8వాని మనస్సు స్థిరముగానుండును
తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరువరకు
వాడు భయపడడు.
9వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును
వాని నీతి నిత్యము నిలుచును
వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును.
10భక్తిహీనులు దాని చూచి చింతపడుదురువారు పండ్లుకొరుకుచు క్షీణించి పోవుదురు
భక్తిహీనుల ఆశ భంగమైపోవును.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for కీర్తనలు 112