YouVersion Logo
Search Icon

కీర్తనలు 100

100
స్తుత్యర్పణ కీర్తన.
1సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని
చేయుడి.
2సంతోషముతో యెహోవాను సేవించుడి
ఉత్సాహగానముచేయుచు ఆయన సన్నిధికి రండి.
3యెహోవాయే దేవుడని తెలిసికొనుడి
ఆయనే మనలను పుట్టించెను#100:3 మనలను మనమే సృజించుకొనలేదు. మనము ఆయన
వారము
మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము.
4కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో
ప్రవేశించుడి
కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి
ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి.
5యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును
ఆయన సత్యము తరతరములుండును.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for కీర్తనలు 100