YouVersion Logo
Search Icon

కీర్తనలు 1

1
ప్రథమ స్కంధము
1దుష్టుల ఆలోచనచొప్పున నడువక
పాపుల మార్గమున నిలువక
అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక
2యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు
దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.
3అతడు నీటికాలువల యోరను నాటబడినదై
ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును
అతడు చేయునదంతయు సఫలమగును.
4దుష్టులు ఆలాగున నుండక
గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు.
5కాబట్టి న్యాయవిమర్శలో దుష్టులును
నీతిమంతుల సభలో పాపులును నిలువరు.
6నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును
దుష్టుల మార్గము నాశనమునకు నడుపును.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in