YouVersion Logo
Search Icon

సామెతలు 2

2
1నా కుమారుడా, నీవు నా మాటల నంగీకరించి నా
ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల
2జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా
వివేచన నభ్యసించినయెడల
3తెలివికై మొఱ్ఱపెట్టినయెడల
వివేచనకై మనవి చేసినయెడల
4వెండిని వెదకినట్లు దాని వెదకినయెడల
దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల
5యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట
యెట్టిదో నీవు గ్రహించెదవు
దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును.
6యెహోవాయే జ్ఞానమిచ్చువాడు
తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును.
7ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును
యుక్తమార్గము తప్పక నడుచుకొనువారికి ఆయన కేడెముగా నున్నాడు.
8న్యాయము తప్పిపోకుండ ఆయన కనిపెట్టును
తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును.
9అప్పుడు నీతి న్యాయములను
యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలిసికొందువు.
10జ్ఞానము నీ హృదయమున జొచ్చును
తెలివి నీకు మనోహరముగానుండును
11బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును.
12అది దుష్టుల మార్గమునుండియు
మూర్ఖముగా మాటలాడువారి చేతిలోనుండియు నిన్నురక్షించును.
13అట్టివారు చీకటి త్రోవలలో నడువవలెనని
యథార్థమార్గములను విడిచిపెట్టెదరు
14కీడుచేయ సంతోషించుదురు
అతిమూర్ఖుల ప్రవర్తనయందు ఉల్లసించుదురు.
15వారు నడుచుకొను త్రోవలు వంకరవివారు కుటిలవర్తనులు
16మరియు అది జారస్త్రీనుండి
మృదువుగా మాటలాడు పరస్త్రీనుండి నిన్ను రక్షించును.
17అట్టి స్త్రీ తన యౌవనకాలపు ప్రియుని విడుచునది
తన దేవుని నిబంధనను మరచునది.
18దాని యిల్లు మృత్యువునొద్దకు దారితీయును
అది నడచు త్రోవలు ప్రేతలయొద్దకు చేరును
19దానియొద్దకు పోవువారిలో ఎవరును తిరిగి రారు
జీవమార్గములు వారికి దక్కవు.
నా మాటలు వినినయెడల
20నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు
నీతిమంతుల ప్రవర్తనల ననుసరించుదువు.
21యథార్థవంతులు దేశమందు నివసించుదురు
లోపములేనివారు దానిలో నిలిచియుందురు.
22భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు.
విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికివేయబడుదురు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy