YouVersion Logo
Search Icon

మీకా 2

2
1మంచములమీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ; ఆలాగు చేయుట వారి స్వాధీనములోనున్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. 2వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు, ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటివానిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. 3కాబట్టి యెహోవా సెలవిచ్చునదేమనగా– గొప్పఅపాయ కాలమువచ్చుచున్నది. దాని క్రిందనుండి తమ మెడలను తప్పించుకొనలేకుండునంతగాను, గర్వముగా నడువలేకుండునంతగాను ఈ వంశమునకు కీడుచేయనుద్దేశించుచున్నాను. 4ఆ దినమున జనులు మిమ్మునుగురించి బహుగా అంగలార్చుచు సామెత నెత్తుదురు. వారు చెప్పు సామెత ఏదనగా–మనము బొత్తిగా చెడిపోయి యున్నామనియు, ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యులకిచ్చియున్నాడనియు, మనయొద్ద నుండకుండ ఆయన దానిని తీసివేసెనే యనియు, మన భూములను తిరుగబడినవారికి ఆయన విభజించియున్నాడనియు ఇశ్రాయేలీయులు అనుకొను చున్నట్లు జనులు చెప్పుకొందురు. 5చీట్లు వేయగా యెహోవా సమాజములో మీరు పాలుపొందునట్లు నూలు వేయువాడొకడును ఉండడు. 6మీరు దీని ప్రవచింప వద్దని వారు ప్రకటన చేయుదురు. ప్రవచింపనియెడల అవమానము కలుగక మానదు. 7యాకోబు సంతతివారని పేరు పెట్టబడినవారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గి పోయెనా? యీ క్రియలు ఆయనచేత జరిగెనా? యథా ర్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమసాధనములు కావా? 8ఇప్పుడేగదా నా జనులు శత్రువులైరి; నిర్భయముగా సంచరించువారిని చూచి వారు కట్టుపంచెలను మాత్రము విడిచి వారి పై వస్త్రములను లాగుకొందురు. 9వారికిష్టమైన యిండ్లలోనుండి నా జనులయొక్క స్త్రీలను మీరు వెళ్లగొట్టుదురు, వారి బిడ్డల యొద్దనుండి నేనిచ్చిన ఘనతను ఎన్నడునులేకుండ మీరు ఎత్తికొని పోవుదురు. 10ఈ దేశము మీ విశ్రాంతిస్థలముకాదు; మీరు లేచి వెళ్లి పోవుడి, మీకు నాశనము నిర్మూల నాశనము కలుగునంతగా మీరు అపవిత్రక్రియలు జరిగించితిరి. 11వ్యర్థమైన మాటలు పలుకుచు, అబద్ధికుడై ద్రాక్షారసమునుబట్టియు మద్యమునుబట్టియు నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చినయెడల వాడే ఈ జనులకు ప్రవక్త యగును.
12యాకోబు సంతతీ, తప్పక నేను మిమ్మునందరిని పోగు చేయుదును, ఇశ్రాయేలీయులలో శేషించినవారిని తప్పక సమకూర్చుదును. బొస్రా గొఱ్ఱెలు కూడునట్లు వారిని సమకూర్చుదును, తమ మేతస్థలములలో వారిని పోగు చేతును, గొప్ప ధ్వని పుట్టునట్లుగా మనుష్యులు విస్తారముగా కూడుదురు. 13ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగాపోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవావారికి నాయకుడుగా ఉండును.

Currently Selected:

మీకా 2: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy