YouVersion Logo
Search Icon

యోవేలు 2

2
1సీయోను కొండమీద బాకా ఊదుడి
నా పరిశుద్ధపర్వతముమీద హెచ్చరిక నాదము
చేయుడి యెహోవా దినము వచ్చుచున్నదనియు
అది సమీపమాయెననియు దేశనివాసులందరు వణకు
దురుగాక.
2ఆ దినము అంధకారమయముగా ఉండును మహాంధ
కారము కమ్మును
మేఘములును గాఢాంధకారమును ఆ దినమున కమ్మును
పర్వతములమీద ఉదయకాంతి కనబడునట్లు అవి కన
బడుచున్నవి.
అవి బలమైన యొక గొప్ప సమూహము
ఇంతకుముందు అట్టివి పుట్టలేదు
ఇకమీదట తరతరములకు అట్టివి పుట్టవు.
3వాటిముందర అగ్ని మండుచున్నది
వాటివెనుక మంట కాల్చుచున్నది
అవి రాకమునుపు భూమి ఏదెనువనమువలె ఉండెను
అవి వచ్చిపోయిన తరువాత తప్పించుకొనినదేదియు
విడువబడక భూమి యెడారివలె పాడాయెను.
4వాటి రూపములు గుఱ్ఱముల రూపములవంటివి
రౌతులవలె అవి పరుగెత్తి వచ్చును.
5రథములు ధ్వని చేయునట్లు
కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయునట్లు
యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేయునట్లు
అవి పర్వతశిఖరములమీద గంతులు వేయుచున్నవి.
6వాటిని చూచి జనములు వేదననొందును అందరి ముఖ
ములు తెల్లబారును.
7బలాఢ్యులు పరుగెత్తునట్లు అవి పరుగెత్తుచున్నవి
శూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు
దాటుచున్నవి
ఇటు అటు తిరుగకుండ అవన్నియు చక్కగా పోవుచున్నవి
8ఒకదానిమీద ఒకటి త్రొక్కులాడక
అవన్నియు చక్కగా పోవుచున్నవి
ఆయుధములమీద పడినను త్రోవ విడువవు.
9పట్టణములో నఖముఖాల పరుగెత్తుచున్నవి
గోడలమీద ఎక్కి యిండ్లలోనికి చొరబడుచున్నవి.
దొంగలు వచ్చినట్లు కిటికీలలోగుండ జొరబడుచున్నవి.
10వాటి భయముచేత భూమి కంపించుచున్నది
ఆకాశము తత్తరించుచున్నది సూర్యచంద్రులకు తేజో
హీనత కలుగుచున్నది
నక్షత్రములకు కాంతి తప్పుచున్నది.
11యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుమువలె
గర్జించుచున్నాడు
ఆయన దండు బహు గొప్పదైయున్నది
ఆయన ఆజ్ఞను నెరవేర్చునది బలముగలది
యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళ
గలవాడెవడు?
12ఇప్పుడైనను మీరు ఉపవాసముండి
కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా
తిరిగి నాయొద్దకు రండి.
ఇదే యెహోవా వాక్కు
13మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును, శాంతమూర్తియు అత్యంతకృపగలవాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములనుకాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి. 14ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును; అనుగ్రహింపడని యెవడు చెప్పగలడు?
15సీయోనులో బాకా ఊదుడి, ఉపవాసదినము ప్రతి
ష్ఠించుడి,
వ్రతదినము నియమించి ప్రకటనచేయుడి.
16జనులను సమకూర్చుడి, సమాజకూటము ప్రతిష్ఠించుడి,
పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము
చేయు బిడ్డలను తోడుకొని రండి;
పెండ్లికుమారుడు అంతఃపురములోనుండియు
పెండ్లికుమార్తె గదిలోనుండియు రావలయును.
17యెహోవాకు పరిచర్యచేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు –యెహోవా, నీ జనులయెడల జాలిచేసికొని, అన్యజనులు వారిమీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమున కప్పగింపకుము; లేనియెడల అన్యజనులు–వారి దేవుడు ఏమాయెనందురు గదా యని వేడుకొనవలెను.
18అప్పుడు యెహోవా తన దేశమునుబట్టి రోషము పూని తన జనులయెడల జాలిచేసికొనెను. 19మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా– ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక, మీరు తృప్తినొందునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించెదను 20మరియు ఉత్తరదిక్కునుండి వచ్చువాటిని మీకు దూరముగా పార దోలి, యెండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును; అవి గొప్ప కార్యములు చేసెను గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోకిని, వెనుకటి భాగమును పడమటి సముద్రములోకిని పడగొట్టుదును; అక్కడ వాటి దుర్గంధము లేచును అవి కుళ్లు వాసన కొట్టును. 21దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్పకార్యములు చేసెను. 22పశువులారా, భయపడకుడి, గడ్డిబీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపుచెట్లును, ద్రాక్షచెట్లు సమృద్ధిగా ఫలించును, 23సీయోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవాయందు సంతోషించుడి; తన నీతినిబట్టి ఆయన తొలకరి వర్షమును మీకనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందువలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకనుగ్రహించును 24కొట్లు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగలకుపైగా పొర్లి పారును. 25మీరు కడుపార తిని తృప్తిపొంది మీకొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతలును గొంగళి పురుగులును పసరు పురుగులును చీడపురుగులును అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును. 26నా జనులు ఇక నెన్నటికిని సిగ్గునొందరు. 27అప్పుడు ఇశ్రాయేలీయులమధ్య నున్నవాడను నేనే యనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడును లేడనియు మీరు తెలిసికొందురు; నా జనులు ఇక నెన్నడును సిగ్గునొందకయుందురు.
28తరువాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మ రింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ యౌవనులు దర్శనములు చూతురు. 29ఆ దినములలో నేను పనివారిమీదను పనికత్తెలమీదను నా ఆత్మను కుమ్మ రింతును. 30మరియు ఆకాశమందును భూమియందును మహత్కార్యములను, అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరచెదను 31యెహోవాయొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజో హీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. 32యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండమీదను యెరూషలేములోను తప్పించుకొనినవారుందురు, శేషించినవారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థనచేయు వారందరును రక్షింపబడుదురు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy