YouVersion Logo
Search Icon

యోవేలు 1

1
1పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు
2పెద్దలారా, ఆలకించుడి
దేశపు కాపురస్థులారా, మీరందరు చెవియొగ్గి వినుడి
ఈలాటి సంగతి మీ దినములలో గాని
మీపితరుల దినములలోగాని జరిగినదా?
3ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి.వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరమువారిని తెలియజేయుదురు.
4గొంగళిపురుగులు విడిచినదానిని మిడుతలు తినివేసి
యున్నవి
మిడుతలు విడిచినదానిని పసరుపురుగులు తినివేసి
యున్నవి.
పసరుపురుగులు విడిచినదానిని చీడపురుగులు తినివేసి
యున్నవి.
5మత్తులారా, మేలుకొని కన్నీరు విడువుడి
ద్రాక్షారసపానము చేయువారలారా, రోదనము
చేయుడి.
క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండ నాశ
మాయెను,
6లెక్కలేని బలమైన జనాంగము#1:6 సమూహము. నా దేశము మీదికి
వచ్చియున్నది
వాటి పళ్లు సింహపు కోరలవంటివి
వాటి కాటు ఆడుసింహపు కాటువంటిది.
7అవి నా ద్రాక్షచెట్లను పాడుచేసియున్నవి
నా అంజూరపు చెట్లను తుత్తునియలుగా కొరికి
యున్నవి
బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్లకొమ్మలు
తెలుపాయెను
8పెనిమిటి పోయిన యౌవనురాలు గోనెపట్ట కట్టు
కొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము.
9నైవేద్యమును పానార్పణమును
యెహోవా మందిరములోనికి రాకుండ నిలిచి
పోయెను.
యెహోవాకు పరిచర్యచేయు యాజకులు అంగలార్చుచున్నారు.
10పొలము పాడైపోయెను
భూమి అంగలార్చుచున్నది ధాన్యము నశించెను
క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను తైలవృక్షములు
వాడిపోయెను.
11భూమిమీది పైరు చెడిపోయెను
గోధుమ కఱ్ఱలను యవల కఱ్ఱలను చూచి సేద్య
గాండ్లారా, సిగ్గునొందుడి.
12ద్రాక్షతోట కాపరులారా, రోదనము చేయుడి.
ద్రాక్షచెట్లు చెడిపోయెను అంజూరపుచెట్లు వాడి
పోయెను
దానిమ్మచెట్లును ఈతచెట్లును జల్దరుచెట్లును తోట
చెట్లన్నియు వాడిపోయినవి
13నరులకు సంతోషమేమియు లేకపోయెను.
యాజకులారా, గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి.
బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారలారా,
రోదనము చేయుడి.
నా దేవుని పరిచారకులారా,
గోనెపట్ట వేసికొని రాత్రి అంతయు గడపుడి.
నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిర
మునకు రాకుండ నిలిచిపోయెను.
14ఉపవాసదినము ప్రతిష్ఠించుడి వ్రతదినము ఏర్పరచుడి
యెహోవాను బతిమాలుకొనుటకై
పెద్దలను దేశములోని జనులందరిని
మీదేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి.
15ఆహా, యెహోవా దినము వచ్చెనే
అది ఎంత భయంకరమైన దినము!
అది ప్రళయమువలెనే సర్వశక్తునియొద్దనుండి వచ్చును.
16మనము చూచుచుండగా మన దేవుని మందిరములో
ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను
మన ఆహారము నాశనమాయెను.
17విత్తనము మంటిపెడ్డల క్రింద కుళ్లిపోవుచున్నది
పైరు మాడిపోయినందున ధాన్యపుకొట్లు వట్టి
వాయెను
కళ్లపుకొట్లు నేలపడియున్నవి.
18మేతలేక పశువులు బహుగా మూల్గుచున్నవి
ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి
గొఱ్ఱెమందలు చెడిపోవుచున్నవి.
19అగ్నిచేత అరణ్యములోని మేతస్థలములు కాలిపోయినవి
మంట తోటచెట్లన్నిటిని కాల్చివేసెను
యెహోవా, నీకే నేను మొఱ్ఱపెట్టుచున్నాను.
20నదులు ఎండిపోవుటయు అగ్నిచేత మేతస్థలములు
కాలిపోవుటయు చూచి పశువులును నీకు మొఱ్ఱ
పెట్టుచున్నవి.#1:20 ఎగరోజుచున్నవి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy