YouVersion Logo
Search Icon

యోబు 32

32
1యోబు తన దృష్టియందు తాను నీతిమంతుడై యున్నాడని ఆ ముగ్గురు మనుష్యులు తెలిసికొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. 2అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరకెయేలు కుమారుడునగు ఎలీహు, యోబు దేవునికంటె తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి అతనిమీద బహుగా కోపగించెను. 3మరియు యోబుయొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తర మేమియు చెప్పకయే యోబుమీద దోషము మోపినందుకు వారిమీద కూడ అతడు బహుగా కోపగించెను.
4వారు ఎలీహుకన్న ఎక్కువ వయస్సుగలవారు గనుక అతడు యోబుతో మాటలాడవలెనని కనిపెట్టి యుండెను. 5అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుష్యులు ప్రత్యుత్తర మేమియు ఇయ్యకపోవుట చూచినప్పుడు అతని కోపము రేగెను. 6కావున బూజీయుడైన బరకెయేలు కుమారుడగు ఎలీహు ఈలాగు మాటలాడసాగెను–
నేను పిన్నవయస్సుగలవాడను మీరు బహు వృద్ధులు
ఆ హేతువుచేతను నేను భయపడి నా తాత్పర్యము
మీకు తెలుపుటకు తెగింపలేదు.
7వృద్ధాప్యము మాటలాడదగును
అధిక సంఖ్యగల యేండ్లు జ్ఞానము బోధింపతగునని
నేననుకొంటిని;
8అయినను నరులలో ఆత్మ ఒకటి యున్నది
సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగ
జేయును.
9వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు
బహు వయస్సుగలవారు ఒకప్పుడు న్యాయము తెలిసినవారుకారు.
10కావున నేను–నా మాట నంగీకరించుడని మనవి చేసికొనుచున్నాను.
నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును.
11ఏమి పలుకుదుమా అని మీరు యోచనచేయుచుండగా
నేను మీ మాటలకొరకు కనిపెట్టుకొంటిని
మీ అభిప్రాయములు చెవిని వేసికొనుటకై
12మీరు చెప్పినవాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చితిని
అయితే మీలో ఎవరును యోబును ఖండింపలేదు
ఎవరును అతని మాటలకు ప్రత్యుత్తరమియ్యలేదు.
13కావున–మాకు జ్ఞానము లభించినదనియు
దేవుడే గాని నరులు అతని జయింపనేరరనియు మీరు
పలుకకూడదు.
14అతడు నాతో వాదమాడలేదు
మీరు చెప్పిన మాటలనుబట్టి నేనతనికి ప్రత్యుత్తర
మియ్యను.
15వారు ఆశ్చర్యపడి ఇకను ఉత్తరమియ్యకయున్నారు
పలుకుటకు వారికి మాటయొకటియులేదు.
16కాగా వారికనేమియు ప్రత్యుత్తరము చెప్పకయున్నారువారు మాటలాడక పోవుట చూచి నేను ఊరకుందునా?
17నేను ఇయ్యవలసిన ప్రత్యుత్తరము నేనిచ్చెదను
నేనును నా తాత్పర్యము తెలిపెదను.
18నా మనస్సునిండ మాటలున్నవి
నా అంతరంగముననున్న ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది.
19నా మనస్సు తెరువబడని ద్రాక్షారసపు తిత్తివలె
నున్నది
క్రొత్త తిత్తులవలె అది పగిలిపోవుటకు సిద్ధముగా
నున్నది.
20నేను మాటలాడి ఆయాసము తీర్చుకొనెదను
నా పెదవులు తెరచి నేను ప్రత్యుత్తరమిచ్చెదను.
21మీరు దయచేసి వినుడి నేను ఎవరియెడలను పక్ష
పాతినై యుండను.
నేను ఎవరికిని ముఖస్తుతికై బిరుదులు పెట్టను
22ముఖస్తుతి చేయుట నా చేత కాదు
అట్లు చేసినయెడల నన్ను సృజించినవాడు నన్ను
శీఘ్రముగా నిర్మూలము చేయును.

Currently Selected:

యోబు 32: TELUBSI

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in