YouVersion Logo
Search Icon

యోబు 24

24
1సర్వశక్తుడగువాడు నియామకకాలములను ఎందుకు
ఏర్పాటుచేయడు?
ఆయన నెరిగియున్నవారు ఆయన దినములను
ఎందుచేత చూడకున్నారు?
2సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరువారు అక్రమముచేసి మందలను ఆక్రమించుకొని
వాటిని మేపుదురు.
3తండ్రిలేనివారి గాడిదను తోలివేయుదురు
విధవరాలి యెద్దును తాకట్టుగా తీసికొందురు
4వారు మార్గములోనుండి దరిద్రులను తొలగించి
వేయుదురు
దేశములోని బీదలు ఎవరికిని తెలియకుండ
దాగవలసివచ్చెను.
5అరణ్యములోని అడవిగాడిదలు తిరుగునట్లు
బీదవారు తమ పనిమీద బయలుదేరి వేటను వెదకుదురు
ఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరకును
6పొలములో వారు తమకొరకు గడ్డి కోసికొందురు
దుష్టుల ద్రాక్షతోటలలో పరిగ ఏరుదురు.
7బట్టలులేక రాత్రి అంతయు పండుకొనియుందురు
చలిలో వస్త్రహీనులై పడియుందురు.
8పర్వతములమీది జల్లులకు తడిసియుందురు
చాటులేనందున బండను కౌగలించుకొందురు.
9తండ్రిలేని పిల్లను రొమ్మునుండి లాగువారు కలరువారు దరిద్రులయొద్ద తాకట్టు పుచ్చుకొందురు
10దరిద్రులు వస్త్రహీనులై బట్టలులేక తిరుగులాడుదురు
ఆకలిగొని పనలను మోయుదురు.
11వారు తమ యజమానుల గోడలలోపల నూనె
గానుగలను ఆడించుదురు
ద్రాక్ష గానుగలను త్రొక్కుచు దప్పిగలవారై
యుందురు.
12జనముగల పట్టణములో మూలుగుదురు
గాయపరచబడినవారు మొఱ్ఱపెట్టుదురు
అయినను జరుగునది అక్రమమని దేవుడు ఎంచడు.
13వెలుగుమీద తిరుగబడువారు కలరు
వీరు దాని మార్గములను గురుతుపట్టరు
దాని త్రోవలలో నిలువరు.
14తెల్లవారునప్పుడు నరహంతకుడు లేచును
వాడు దరిద్రులను లేమిగలవారిని చంపును
రాత్రియందు వాడు దొంగతనము చేయును.
15వ్యభిచారి–ఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన
ముఖమునకు ముసుకు వేసికొని సందె చీకటి
కొరకు కనిపెట్టును.
16చీకటిలో వారు కన్నము వేయుదురు
పగలు దాగుకొందురువారు వెలుగు చూడనొల్లరు
17వారందరు ఉదయమును మరణాంధకారముగా
ఎంచుదురు.
గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసి
యున్నది.
జలములమీద వారు తేలికగా కొట్టుకొని పోవుదురు
18వారి స్వాస్థ్యము భూమిమీద శాపగ్రస్తము
ద్రాక్షతోటల మార్గమునవారు ఇకను నడువరు.
19అనావృష్టిచేతను ఉష్ణముచేతను మంచు నీళ్లు ఎగసి
పోవునట్లు
పాతాళము పాపముచేసినవారిని పట్టుకొనును.
20కన్నగర్భము వారిని మరచును, పురుగు వారిని కమ్మగా
తినివేయునువారు మరి ఎప్పుడును జ్ఞాపకములోనికి రారు
వృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు
21వారు పిల్లలు కనని గొడ్రాండ్రను బాధపెట్టుదురు
విధవరాండ్రకు మేలుచేయరు.
22ఆయన తన బలముచేతను బలవంతులను కాపాడు
చున్నాడు
కొందరు ప్రాణమునుగూర్చి ఆశ విడిచినను వారు
మరల బాగుపడుదురు.
23ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు
ఆధారము నొందుదురు
ఆయన వారి మార్గములమీద తన దృష్టి నుంచును
24వారు హెచ్చింపబడినను
కొంతసేపటికి లేకపోవుదురువారు హీనస్థితిలో చొచ్చి ఇతరులందరివలె త్రోయ
బడుదురు, పండిన వెన్నులవలె కోయబడుదురు.
25ఇప్పుడు ఈలాగు జరుగని యెడల నేను అబద్ధికుడనని
రుజువుపరచువాడెవడు?
నా మాటలు వట్టివని దృష్టాంతపరచువాడెవడు?

Currently Selected:

యోబు 24: TELUBSI

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in