YouVersion Logo
Search Icon

యెషయా 9

9
1అయినను వేదనపొందిన దేశముమీద మబ్బు నిలువ
లేదు
పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును
నఫ్తాలి దేశమును అవమానపరచెను
అంత్యకాలమున ఆయన సముద్రప్రాంతమును, అనగా
యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును
మహిమగలదానిగా చేయుచున్నాడు.
2చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు
మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకాశించును.
3నీవు జనమును విస్తరింపజేయుచున్నావువారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు
కోతకాలమున మనుష్యులు సంతోషించునట్లు
దోపుడుసొమ్ము పంచుకొనువారు సంతోషించునట్లువారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు.
4మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని
నీవు విరిచియున్నావు
వాని మెడను కట్టుకఱ్ఱను వాని తోలువాని కొరడాలను
విరిచియున్నావు.
5యుద్ధపుసందడిచేయు యోధులందరి జోళ్లును
రక్తములో పొరలింపబడిన వస్త్రములును అగ్నిలో
వేయబడి దహింపబడును.
6ఏలయనగా మనకు శిశువు పుట్టెను
మనకు కుమారుడు అనుగ్రహింపబడెను
ఆయన భుజముమీద రాజ్యభారముండును.
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు
నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని
అతనికి పేరు పెట్టబడును.
7ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ
మును కలుగునట్లు
సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును
నియమించును
న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచు
టకు
అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును.
సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని
నెరవేర్చును.
8ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా
అది ఇశ్రాయేలువరకు దిగివచ్చియున్నది.
9అది ఎఫ్రాయిముకును షోమ్రోను నివాసులకును
ప్రజలకందరికి తెలియవలసియున్నది.
10వారు–ఇటికలతో కట్టినది పడిపోయెను
చెక్కిన రాళ్లతో కట్టుదము రండి;
రావికఱ్ఱతో కట్టినది నరకబడెను,
వాటికి మారుగా దేవదారు కఱ్ఱను వేయుదము రండని
అతిశయపడి గర్వముతో చెప్పుకొనుచున్నారు.
11యెహోవా వానిమీదికి రెజీనునకు విరోధులైన వారిని
హెచ్చించుచు వాని శత్రువులను రేపుచున్నాడు.
12తూర్పున సిరియాయు పడమట ఫిలిష్తీయులును
నోరు తెరచి ఇశ్రాయేలును మ్రింగివేయవలెననియున్నారు
ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు.
ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.
13అయినను జనులు తమ్ము కొట్టినవానితట్టు తిరుగుట లేదు
సైన్యములకధిపతియగు యెహోవాను వెదకరు.
14కావున యెహోవా ఇశ్రాయేలులోనుండి
తలను తోకను తాటికమ్మను రెల్లును
ఒక్క దినమున కొట్టివేయును.
15పెద్దలును ఘనులును తల; కల్లలాడు ప్రవక్తలు తోక.
16ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు
వారిని వెంబడించువారు వారిచేత మ్రింగివేయబడు
దురు.
17వారందరును భక్తిహీనులును దుర్మార్గులునై యున్నారు
ప్రతి నోరు దుర్భాషలాడును
కాబట్టి ప్రభువు వారి యౌవనస్థులను చూచి సంతో
షింపడు
వారిలో తలిదండ్రులు లేనివారియందైననువారి విధవరాండ్రయందైనను జాలిపడడు.
ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు
ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.
18భక్తిహీనత అగ్నివలె మండుచున్నది
అది గచ్చపొదలను బలురక్కసి చెట్లను కాల్చి అడవి
పొదలలో రాజును
అవి దట్టమైన పొగవలె చుట్టుకొనుచు పైకి ఎగయును.
19సైన్యములకధిపతియగు యెహోవా ఉగ్రతవలన
దేశము కాలిపోయెను.
జనులును అగ్నికి కట్టెలవలె నున్నారువారిలో ఒకనినొకడు కరుణింపడు.
20కుడిప్రక్కన ఉన్నదాని పట్టుకొందురు గాని
ఇంకను ఆకలిగొని యుందురు;
ఎడమప్రక్కన ఉన్నదాని భక్షించుదురు గాని
ఇంకను తృప్తిపొందక యుందురు
వారిలో ప్రతివాడు తన బాహువును భక్షించును
21మనష్షే ఎఫ్రాయిమును ఎఫ్రాయిము మనష్షేను
భక్షించును
వీరిద్దరు ఏకీభవించి యూదామీద పడుదురు.
ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు
ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

Currently Selected:

యెషయా 9: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy