YouVersion Logo
Search Icon

యెషయా 4

4
1ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టు
కొని
– మేము మా అన్నమే తిందుము మా వస్త్రములే
కట్టుకొందుము,
నీ పేరుమాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయు
మని చెప్పుదురు.
2ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూష
ణమునగును.
ఇశ్రాయేలులో తప్పించుకొనినవారికి
భూమిపంట అతిశయాస్పదముగాను శుభలక్షణము
గాను ఉండును.
3సీయోనులో శేషించినవారికి యెరూషలేములో
నిలువబడినవానికి
అనగా జీవముపొందుటకై యెరూషలేములో దాఖ
లైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు.
4తీర్పుతీర్చు ఆత్మవలనను దహించు ఆత్మవలనను ప్రభువు
సీయోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయునప్పుడు
యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్యనుండి
తీసివేసి దాని శుద్ధిచేయునప్పుడు
5సీయోనుకొండలోని ప్రతి నివాసస్థలముమీదను దాని
ఉత్సవ సంఘములమీదను
పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాలా
ప్రకాశమును యెహోవా కలుగజేయును.
6మహిమ అంతటిమీద వితానముండును
పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను
చాటుగాను పర్ణశాల యొకటి యుండును.

Currently Selected:

యెషయా 4: TELUBSI

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in