YouVersion Logo
Search Icon

యెషయా 2

2
1యూదానుగూర్చియు యెరూషలేమునుగూర్చియు
ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనమువలన
కలిగిన దేవోక్తి–
2అంత్యదినములలో పర్వతములపైన యెహోవామందిర
పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల
కంటె ఎత్తుగా ఎత్తబడును
ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి
వచ్చెదరు
3ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము
యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు
వెళ్లును.
జనములు గుంపులు గుంపులుగా వచ్చి
–యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వత
మునకు మనము వెళ్లుదము రండి
ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును
మనము ఆయన త్రోవలలో నడుచుదము
అని చెప్పుకొందురు.
4ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును
అనేక జనములకు తీర్పుతీర్చునువారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను
తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు
జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును
యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.
5యాకోబు వంశస్థులారా, రండి
మనము యెహోవా వెలుగులో నడుచుకొందము.
6యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన
జనుల సంప్రదాయములతో నిండుకొనియున్నారువారు ఫిలిష్తీయులవలె మంత్ర ప్రయోగము చేయుదురు
అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు
వారిని విసర్జించియున్నావు.
7వారి దేశము వెండి బంగారములతో నిండియున్నదివారి ఆస్తి సంపాద్యమునకు మితిలేదు
వారి దేశము గుఱ్ఱములతో నిండియున్నది వారి రథ
ములకు మితిలేదు.
8వారి దేశము విగ్రహములతో నిండియున్నదివారు తమ చేతిపనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి
నమస్కారము చేయుదురు
9అల్పులు అణగద్రొక్కబడుదురు ఘనులు తగ్గింపబడు
దురు
కాబట్టి వారిని క్షమింపకుము.
10యెహోవా భీకరసన్నిధినుండియు ఆయన ప్రభావ
మహాత్మ్యమునుండియు బండ బీటలోనికి దూరుము
మంటిలో దాగి యుండుము.
11నరుల అహంకారదృష్టి తగ్గింపబడును
మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును
ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును.
12అహంకారాతిశయముగల ప్రతిదానికిని ఔన్నత్యము
గల ప్రతిదానికిని
విమర్శించు దినమొకటి సైన్యములకధిపతియగు
యెహోవా నియమించియున్నాడు
అవి అణగద్రొక్కబడును.
13ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు
వృక్షములకన్నిటికిని
బాషాను సింధూర వృక్షములకన్నిటికిని
14ఉన్నతపర్వతములకన్నిటికిని ఎత్తయిన మెట్లకన్నిటికిని
15ఉన్నతమైన ప్రతిగోపురమునకును బురుజులుగల ప్రతి
కోటకును
16తర్షీషు ఓడలకన్నిటికిని రమ్యమైన విచిత్ర వస్తువుల
కన్నిటికిని
ఆ దినము నియమింపబడియున్నది.
17అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును
మనుష్యుల గర్వము తగ్గింపబడును
ఆ దినమున యెహోవామాత్రమే ఘనత వహించును.
18విగ్రహములు బొత్తిగా నశించిపోవును.
19యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు
ఆయన భీకర సన్నిధినుండియు
ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు
మనుష్యులు కొండల గుహలలో దూరుదురు నేల
బొరియలలో దూరుదురు.
20-21ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణకింప
లేచునప్పుడు
ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ
మాహాత్మ్యమునుండియు
కొండల గుహలలోను బండబీటలలోను
దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకై
చేయించుకొనిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహ
ములను
ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు.
22తన నాసికారంధ్రములలో ప్రాణముకలిగిన నరుని
లక్ష్యపెట్టకుము;
వానిని ఏవిషయములో ఎన్నిక చేయవచ్చును?

Currently Selected:

యెషయా 2: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy