YouVersion Logo
Search Icon

హెబ్రీయులకు 3

3
1ఇందువలన, పరలోకసంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధానయాజకుడునైన యేసుమీద లక్ష్యముంచుడి. 2దేవుని యిల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు, ఈయన కూడ తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. 3-4ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును;#3:3-4 లేక, స్థాపింపబడును. సమస్తమును కట్టినవాడు#3:3-4లేక, స్థాపింపంచినవాడు. దేవుడే. ఇంటికంటె దానిని కట్టిన వాడెక్కువ ఘనతపొందినట్టు, ఈయన మోషేకంటె ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. 5ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడైయుండి దేవుని యిల్లంతటిలో నమ్మకముగా ఉండెను. 6అయితే క్రీస్తు కుమారుడైయుండి, ఆయన యింటిమీద నమ్మకముగా ఉన్నాడు; ధైర్యమును నిరీక్షణవలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపెట్టినయెడల మనమే ఆయన యిల్లు. 7మరియు పరిశుద్ధాత్మ యిట్లు చెప్పుచున్నాడు.
8–నేడు మీరాయన శబ్దమును వినినయెడల, అరణ్య
ములో శోధన దినమందు
కోపము పుట్టించినప్పటివలె
మీ హృదయములను కఠినపరచుకొనకుడి.
9నలువది సంవత్సరములు నా కార్యములను చూచి
మీపితరులు నన్ను పరీక్షించి శోధించిరి.
10కావున నేను ఆ తరమువారివలన విసిగి
–వీరెల్లప్పుడును తమ హృదయాలోచనలలో
తప్పిపోవుచున్నారు
నా మార్గములను తెలిసికొనలేదు
11గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టువారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని.
12సహోదరులారా, జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములేని దుష్టహృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. 13-15నేడు మీరాయన శబ్దమును వినినయెడల, కోపము పుట్టించి నప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక, పాపమువలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు–నేడు అనబడు సమయముండగానే, ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధిచెప్పుకొనుడి. ఏలయనగా మొదటనుండి మనకున్న దృఢ విశ్వాసము అంతముమట్టుకు గట్టిగా చేపెట్టినయెడలనే క్రీస్తులో పాలివారమై యుందుము. 16విని కోపము పుట్టించినవారెవరు? మోషేచేత నడిపింపబడి ఐగుప్తులోనుండి బయలుదేరి వచ్చినవారందరే గదా 17ఎవరిమీద నలువది ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసినవారి మీదనే గదా? వారి శవములు#3:17 లేక, అవయవములు. అరణ్యములో రాలి పోయెను. 18తన విశ్రాంతిలో ప్రవేశింపరని యెవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైనవారినిగూర్చియే గదా 19కాగా అవిశ్వాసముచేతనే వారు ప్రవేశింపలేక పోయిరని గ్రహించుచున్నాము.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy