YouVersion Logo
Search Icon

1 దినవృత్తాంతములు 2

2
1ఇశ్రాయేలు కుమారులు; రూబేను షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు జెబూలూను 2దాను యోసేపు బెన్యామీను నఫ్తాలి గాదు ఆషేరు.
3యూదా కుమారులు ఏరు ఓనాను షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన షూయ కుమార్తెయందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠకుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను. 4మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును జెరహును కనెను. యూదా కుమారులందరును అయిదు గురు. 5పెరెసు కుమారులు హెస్రోను హామూలు. 6జెరహు కుమారులు అయిదుగురు, జిమ్రీ ఏతాను హేమాను కల్కోలు దార. 7కర్మీ కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు; ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలీయులను శ్రమపెట్టెను. 8ఏతాను కుమారులలో అజర్యా అను ఒకడుండెను. 9హెస్రోనునకు పుట్టిన కుమారులు యెరహ్మెయేలు రాము కెలూబై. 10రాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు యూదావారికి పెద్దైయెన నయస్సోనును కనెను. 11నయస్సోను శల్మాను కనెను, శల్మా బోయజును కనెను, 12బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, 13యెష్షయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబును రెండవవాడైన అబీనాదాబును మూడవవాడైన షమ్మాను 14నాలుగవవాడైన నెతనేలును, అయిదవవాడైన రద్దయిని 15ఆరవవాడైన ఓజెమును ఏడవ వాడైన దావీదును కనెను. 16సెరూయా అబీగయీలు వీరి అక్కచెల్లెండ్రు. సెరూయా కుమారులు ముగ్గురు, అబీషై యోవాబు అశాహేలు. 17అబీగయీలు అమాశాను కనెను; ఇష్మాయేలీయుడైన యెతెరు అమాశాకు తండ్రి.
18హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్యయందును యెరీయోతునందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా యేషెరు షోబాబు అర్దోను. 19అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసికొనగా అది అతనికి హూరును కనెను. 20హూరు ఊరిని కనెను, ఊరి బెసలేలును కనెను. 21తరువాత హెస్రోను గిలాదు తండ్రియైన మాకీరు కుమార్తెను కూడెను; తాను అరువది సంవత్సరముల వయస్సుగలవాడైనప్పుడు దానిని వివాహము చేసికొనగా అది అతనికి సెగూబును కనెను. 22సెగూబు యాయీరును కనెను, ఇతనికి గిలాదు దేశమందు ఇరువదిమూడు పట్టణములుండెను. 23మరియు గెషూరువారును సిరియనులును యాయీరు పట్టణములను కెనాతును దాని ఉపపట్టణములను అరువది పట్టణములను వారియొద్దనుండి తీసికొనిరి. వీరందరును గిలాదు తండ్రియైన మాకీరునకు కుమాళ్లు. 24కాలేబుదైన ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తరువాత హెస్రోను భార్యయైన అబీయా అతనికి తెకోవకు తండ్రియైన అష్షూరును కనెను. 25హెస్రోను జ్యేష్ఠ కుమారుడైన యెరహ్మెయేలు కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు రాము బూనా ఓరెను ఓజెము అహీయా. 26అటారా అను ఇంకొక భార్య యెరహ్మెయేలునకు ఉండెను, ఇది ఓనామునకు తల్లి. 27యెరహ్మెయేలునకు జ్యేష్ఠకుమారుడగు రాము కుమారులు మయజు యామీను ఏకెరు. 28ఓనాము కుమారులు షమ్మయి యాదా, షమ్మయి కుమారులు నాదాబు అబీషూరు. 29అబీషూరు భార్యపేరు అబీహయిలు, అది అతనికి అహ్బానును, మొలీదును కనెను. 30నాదాబు కుమారులు సెలెదు అప్పయీము. సెలెదు సంతానములేకుండ చనిపోయెను 31అప్పయీము కుమారులలో ఇషీ అను ఒక డుండెను, ఇషీ కుమారులలో షేషాను అను ఒకడుండెను, షేషాను కుమారులలో అహ్లయి అను ఒకడుండెను, 32షమ్మయి సహోదరుడైన యాదా కుమారులు యెతెరు యోనాతాను; యెతెరు సంతానములేకుండ చనిపోయెను. 33యోనాతాను కుమారులు పేలెతు జాజా; వీరు యెరహ్మెయేలునకు పుట్టినవారు. 34షేషానునకు కుమార్తెలేగాని కుమారులు లేకపోయిరి; ఈ షేషానునకు యర్హా అను ఒక దాసుడుండెను, వాడు ఐగుప్తీయుడు 35షేషాను తన కుమార్తెను తన దాసుడైన యర్హాకు ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను. 36అత్తయి నాతానును కనెను, నాతాను జాబాదును కనెను, 37జాబాదు ఎప్లాలును కనెను, ఎప్లాలు ఓబేదును కనెను, 38ఓబేదు యెహూను కనెను, యెహూ అజర్యాను కనెను, 39అజర్యా హేలెస్సును కనెను, హేలెస్సు ఎలాశాను కనెను, 40ఎలాశా సిస్మాయీని కనెను, సిస్మాయీ షల్లూమును కనెను, 41షల్లూము యెకమ్యాను కనెను, యెకమ్యా ఎలీషామాను కనెను. 42యెరహ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రియైన మేషా, యితడు అతనికి జ్యేష్ఠుడు. అబీ హెబ్రోను మేషాకు కుమారుడు. 43హెబ్రోను కుమారులు కోరహు తప్పూయ రేకెము షెమ. 44షెమ యోర్కెయాము తండ్రియైన రహమును కనెను, రేకెము షమ్మయిని కనెను. 45షమ్మయి కుమారుడు మాయోను, ఈ మాయోను బేత్సూరునకు తండ్రి. 46కాలేబు ఉపపత్నియైన ఏయిఫా హారానును మోజాను గాజేజును కనెను, హారాను గాజేజును కనెను. 47యెహ్దయి కుమారులు రెగెము యోతాము గేషాను పెలెటు ఏయిఫా షయపు. 48కాలేబు ఉపపత్నియైన మయకా షెబెరును తిర్హనాను కనెను. 49మరియు అది మద్మన్నాకు తండ్రియైన షయపును మక్బేనాకును గిబ్యాకు తండ్రియైన షెవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు. 50ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము తండ్రియైన శోబాలును, 51బేత్లెహేము తండ్రియైన శల్మాయును, బేత్గాదేరు తండ్రియైన హారేపును. 52కిర్యత్యారీము తండ్రియైన శోబాలు కుమారులెవరనగా హారోయే హజీహమ్మీను హోతు. 53కిర్యత్యారీము కుమారులెవరనగా ఇత్రీయులును పూతీయులును షుమ్మాతీయులును మిష్రాయీయులును; వీరివలన సొరాతీయులును ఎష్తాయులీయులును కలిగిరి. 54శల్మా కుమారులెవరనగా బేత్లెహేమును నెటోపాతీయులును యోవాబు ఇంటి సంబంధమైన అతారోతీయులును మానహతీయులలో ఒక భాగముగానున్న జారీయులును. 55యబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశములైన తిరాతీయులును షిమ్యాతీయులును శూకోతీయులును; వీరు రేకాబు ఇంటి వారికి తండ్రియైన హమాతువలన పుట్టిన కేనీయుల సంబంధులు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy