యేసుతో ముఖాముఖి预览

స్వస్థతకొన్నిసార్లు వెంటనే జరుగుతుంది,కొన్నిసార్లు ఇది కొన్ని నెలలు లేదా సంవత్సరాలలో దశలలో ఉంటుంది. స్వస్థపరిచే దేవుడు ఒక సార్వభౌమ రాజు,ఏమి చేయాలో,ఎప్పుడు చేయాలో మరియు దాని గురించి ఎలా వెళ్ళాలో ఆయనకు తెలుసు. మన మార్గంలో లేదా మన సమయంలో మనం మన స్వస్థతను పొందేందుకు మనం ఆయన హస్తాన్ని తిప్పలేము,అయితే మన అద్భుతం కోసం, మనం ఆయన కోసం ఎదురుచూడవచ్చు. నిరీక్షణ ప్రతి దానినీ మారుస్తుంది ఎందుకంటే ఇది మన జీవితాలలో భూమి మీద దేవుని చిత్తాన్ని తీసుకురావడానికి ఏదైనా చేయమని దేవునికి ఆహ్వానాన్ని ఇస్తుంది. యేసు ఈ వ్యక్తిని ఒకే సమయంలో సంపూర్ణంగా స్వస్థపరచగలడు,అయితే ఆయనరెండు-దశల ప్రక్రియను ఎంచుకున్నాడు. అతడు దేనినైనా చూడగలుగుతున్నాడా అని అడగడం ద్వారా ఆయన ఆ వ్యక్తిని తన స్వంత స్వస్థతలో కలుపుతున్నాడు. ఆ వ్యక్తి ఇప్పుడు పాక్షికంగా పునరుద్ధరించబడిన చూపు గురించి నిజాయితీగా ఉన్నాడు మరియు యేసు తన చూపును పూర్తిగా పునరుద్ధరించడం ద్వారా ప్రారంభించిన పనిని పూర్తి చేసాడు,తద్వారా "అంతా స్పష్టంగా" కనిపిస్తుంది. మన స్వంత అద్భుతంలో పాల్గొనడం ఎంత బహుమతి. ఆయన రాజ్యం భూమిపైకి రావడాన్ని చూడటానికి సర్వ ప్రపంచ సృష్టికర్త, సంరక్షకునితో భాగస్వామిగా ఉండడం. దానిని మనం ఎప్పుడూ ఉచితంగా వచ్చినట్టు తీసుకోలేము.
మిమ్మల్ని మీరు ప్రశ్నించవలసిన ప్రశ్నలు:
దేవుడు నీ అద్భుతంలో నిన్ను ఎలా పాలుపంచుకున్నాడు?
పాక్షికంగా కాకుండా పూర్తి పునరుద్ధరణ మీకు ఎక్కడ అవసరం?
读经计划介绍

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్థాయిలో యేసుతో సమయాన్ని అనుభవించుటకు నడిపించే దేవుని వాక్యముతో ఈ 40 రోజులూ ప్రతి దినం కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు అని మా నిరీక్షణ.
More