యేసుతో ముఖాముఖి预览

"నేను నమ్ముతాను;నా అవిశ్వాసాన్ని అధిగమించడానికి నాకు సహాయం చేయి”బైబిలులోని అతి చిన్న ప్రార్థనలలో ఒకటి మరియు సామాన్యుడు చేసే అత్యంత నిజాయితీగల ప్రార్థనలలో ఒకటి కావచ్చు. ఈ వ్యక్తి తన కుమారుడు దయ్యముల అణచివేత కారణంగా అనేక సంవత్సరాలు బాధపడటం చూశాడు. అతడు ఒక అద్భుతం కోసం ఆరాటపడుతున్నాడు, మరియు యేసు తన బిడ్డను ఒక్కసారిగా విడిపిస్తాడా లేదా అనే సందేహం మనలాగే అతనికి కూడా ఉంది. యేసు అపవిత్రాత్మను మందలించినప్పుడు కఠినంగా చెప్పాడు, మరియు "మరెన్నడూ ఈ బాలునిలో ప్రవేశించవద్దు" అని ఆజ్ఞాపించాడు. ఎంత గొప్ప అధికారం మరియు ఎంత గొప్ప ఏ శక్తి! ఈయనే మన దేవుడు. ఆయన ఇప్పటికీ అలాగే ఉన్నాడు! దేవుడు ఏదైనా చేయగలడని మనకు చాలా తరచుగా తెలుసు,అయినప్పటికీ మన అపనమ్మకం మధ్యలోనికి వస్తుంది. ఒక పురోగతి కోసం సంవత్సరాల తరబడి వేచి ఉండటం వల్ల లేదా దీర్ఘకాలిక బాధల కారణంగా ఈ అవిశ్వాసం ప్రవేశించి ఉండవచ్చు. మన విశ్వాసం యొక్క కర్త వద్దకు వచ్చి,మన అవిశ్వాసం విషయంలో మనకు సహాయం చేయమని వినయంగా అడగడం చాలా ప్రాముఖ్యం. ఆయన మాత్రమే క్షీణిస్తున్న వాతావరణ-పరాజయం విశ్వాసాన్ని పునరుద్ధరించగలడు మరియు పునరుజ్జీవింపచేయగలడు.
మిమ్మల్ని మీరు ప్రశ్నించవలసిన ప్రశ్నలు:
నా విశ్వాసం అస్థిరమైన నేలపైనా?
ఈ పరిస్థితికి శిష్యులకు అవసరమైన విధంగా నా ప్రార్థన జీవితాన్ని నేను పెంచుకోవడం నా అద్భుతానికి అవసరమా?
读经计划介绍

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్థాయిలో యేసుతో సమయాన్ని అనుభవించుటకు నడిపించే దేవుని వాక్యముతో ఈ 40 రోజులూ ప్రతి దినం కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు అని మా నిరీక్షణ.
More