యేసుతో ముఖాముఖి预览

యేసుతో ముఖాముఖి

40天中的第33天

జక్కయ్యను అతని ప్రజలు "పాపి"గా పరిగణించారు,ఎందుకంటే అతను పన్ను వసూలు చేసేవాడు,రోమా ప్రభుత్వానికి ఇవ్వడానికి తన స్వంత ప్రజల నుండి పన్నులు వసూలు చేసేవాడు. అన్ని ఉద్దేశాలలోనూ, ప్రయత్నాలలోనూ అతడు ఒక దేశద్రోహిగా ఉన్నాడు. అయినప్పటికీ,యేసును తన ఇంటికి ఆహ్వానించాడు మరియు ఆయనతో సమయాన్ని గడిపాడు. ఆ దిన సమయంలో,జక్కయ్యతాజా ఒప్పుదలతో,నూతనజీవనశైలిని బహిరంగంగా ప్రకటించాడు. వ్యక్తిగత చిత్తశుద్ధి మరియు బహిరంగ దాతృత్వంతో కూడుకొన్నది. మనస్సాక్షి మీద ఆకస్మిక దాడి ఎందుకు?ప్రజలు మిమ్మల్ని పట్టుకోగలిగేలా బహిరంగ ఒప్పుకోలు చేయడం ద్వారా కలిగే అదనపు భారం ఎందుకు?యేసు జక్కయ్య కోసం సమయాన్ని వెచ్చిస్తున్నాడని,అతనితోనూ మరియు అతని స్నేహితులతో కూర్చున్నాడు, వారు సమస్తాన్ని మార్చుకొంటుండగా ఆయన వారిని ప్రేమిస్తున్నాడని చెప్పడం సురక్షితం. వారు తృణీకరించబడినవారు, వారితో పాటు వారిలాంటి వారు తప్పించి ఎవరూ ఉండాలని కోరుకోరు. అయినా ఒక రబ్బీ,సమాజంలోని అదృశ్య ప్రజలను చూసిన కళ్లతో,ఆయన వారి పరిధిలోనికితనను తాను ఆహ్వానించుకొన్నప్పుడు సమస్తాన్ని మార్చాడు.

మిమ్మల్ని మీరు ప్రశ్నించవలసిన ప్రశ్నలు:
నా నగరంలో కనిపించని ప్రజలను,తృణీకరించబడిన,తిరస్కరించబడిన మరియు బాధకు గురైన వారిని చూడటానికి నేను సమయం తీసుకుంటానా?
నేను వారిని నా జీవితంలోనికి ఆహ్వానిస్తానా లేదా నేను వారికి క్రీస్తు ప్రేమ యొక్క సాధనంగా ఉండటానికి వారి జీవితంలోనికి ప్రవేశిస్తానా?

读经计划介绍

యేసుతో ముఖాముఖి

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్థాయిలో యేసుతో సమయాన్ని అనుభవించుటకు నడిపించే దేవుని వాక్యముతో ఈ 40 రోజులూ ప్రతి దినం కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు అని మా నిరీక్షణ.

More