యేసుతో ముఖాముఖి预览

యేసుతో ముఖాముఖి

40天中的第35天

మార్తా తన ఇంటిని యేసుకు తెరిచింది మరియు ఆయనకు ప్రతిదీ సరిగ్గా ఉండేలా చూసుకుంది. ఆమె స్పష్టంగా గొప్ప అతిథేయిగా ఉంది. మరోవైపు మరియ,ఆమె సహోదరి యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన మాట్లాడుచున్నదానిని వింటున్నది. ఆమె“ఉత్తమమైన” దానినిఎంచుకున్నట్లు యేసు చెప్పాడు. సహాయం చేయకపోవడం మరియు నేల మీద ఒకరి సమయాన్ని గడపడం ఉత్తమం ఎలా అవుతుంది?

యేసు కోసం చేసే పనులు కంటే యేసుతో ఉండడం చాలా ముఖ్యం అని మనలో చాలామందికి ఇంకా ఏమి అర్థం కాలేదు అని మరియా గుర్తించింది. మనం సంఘంలో సేవ చేయవచ్చు,నిరుపేదలకు వారమంతా మేలు చేయవచ్చు మరియు వాక్యాన్ని కూడా బోధించవచ్చు,అయితేమనం ఆయన స్వరాన్ని వినడానికి దేవునితో సమయానికి ప్రాధాన్యత ఇవ్వకపోయినట్లయితే,అది చాలా గొప్ప నష్టమే! మనం బైబిలు చదవవచ్చు మరియు క్రమం తప్పకుండా ప్రార్థించవచ్చు అయితే మౌనంగా ఉండటానికీ మరియు దేవుని స్వరాన్ని వినడానికీ సమయాన్ని కేటాయించడం యేసు యొక్క ప్రతి అనుచరునికి గుర్తింపదగిన మార్పును తీసుకొని వస్తుంది.

మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న:
నేను 5 నిముషాల పాటు స్థిరంగా ఉండడానికి ప్రయత్నిస్తానా మరియు నాతో మాట్లాడటానికి దేవుణ్ణి అనుమతిస్తానా?

读经计划介绍

యేసుతో ముఖాముఖి

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్థాయిలో యేసుతో సమయాన్ని అనుభవించుటకు నడిపించే దేవుని వాక్యముతో ఈ 40 రోజులూ ప్రతి దినం కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు అని మా నిరీక్షణ.

More