యేసుతో ముఖాముఖి预览

దయ్యం పట్టిన ఒక చిన్న పిల్లవాడిని యేసు విడుదల చేసిన ఈ సంఘటనలో మన విశ్వాసం యొక్క పరిమాణం కాదు నాణ్యత ముఖ్యం. యేసు తన శిష్యులకు విశ్వాసం లేకపోవడాన్ని గద్దించాడు,వీరు బాలుడు శత్రువు చేత బంధింపబడి మరియు సంకెళ్ళు వేయబడడానికి విడిచిపెట్టుటకు బాధ్యులైనారు. మనకు కావలసింది ఆవగింజ పరిమాణం విశ్వాసం మాత్రమే అని యేసు చెప్పడం వినడానికి ఇబ్బందిగా ఉంది ఎందుకంటే మనకు తరచుగా ఆ పరిమాణంలో కూడా విశ్వాసం లేదు అని ఇది స్పష్టంగా ఉంది.
ఆయన అక్కడ ఆగడు,ఆయన హద్దులేని విశ్వాసం యొక్క అద్భుతమైన శక్తి వైపు మన హృదయాలను మరియు మనస్సులను నిర్దేశిస్తాడు. మనము ఒక పర్వతాన్ని మార్చగలమని ఆయన చెప్పాడు,ఒక సాధారణ దినమున సహజ రాజ్యంలో అసాధ్యం. నమ్మిన మనకు అసాధ్యమైనది ఏదీ ఉండదు అని ఆయన అర్థం! ఏమి లేదు?యేసు ఏమీ చెప్పని యెడల - ఇది నిజం. మన విశ్వాసం పర్వతం అంత పరిమాణంలో ఉండనవసరం లేదు,అది కాటు పరిమాణంలో ఉండాలి,ఇంకా దేవుని మీద అజేయమైన విశ్వాసం మరియు ఆయన మాత్రమే చేయగలిగినది చేయగల ఆయన సామర్థ్యంతో నిండి ఉండాలి. సందేహముతో కలగలిసిన విశ్వాసం అస్సలు విశ్వాసం కాదు.
కాబట్టి మనం దేని కోసం ఎదురు చూస్తున్నాము?మనం దేవుణ్ణి నమ్మడం మొదలుపెడదాం,ఆయన మాట ప్రకారం ఆయనను తీసుకొని లోకాన్ని ఆయన కోసం కదిలించండి.
మిమ్ములను మీరు ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలు:
మీ విశ్వాసం యొక్క నాణ్యత ఏమిటి?
సందేహం లేదా భయం మీ విశ్వాసాన్ని కల్తీ చేస్తోందా?
读经计划介绍

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్థాయిలో యేసుతో సమయాన్ని అనుభవించుటకు నడిపించే దేవుని వాక్యముతో ఈ 40 రోజులూ ప్రతి దినం కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు అని మా నిరీక్షణ.
More