యేసుతో ముఖాముఖి预览

యేసుతో ముఖాముఖి

40天中的第26天

స్వీయ- పరిరక్షణ అనేది ప్రతి మనిషిలోను ఉండే ఒక లక్షణం. మన శరీరాలు సృష్టించబడిన మరియు మన మెదడు కట్టబడిన విధానం మనలను మనం రక్షించుకోవడం మరియు ఏదైనా ప్రమాదం నుండి మనలను సురక్షితంగా ఉంచుకోవడం. కాబట్టి ఇది సురక్షితంగా పనిచేయడానికి పేతురు యొక్క సహజ ధోరణిని యేసు తగ్గించడంలో ఆశ్చర్యం లేదు. యేసు అక్కడితో ఆగలేదు అయితే శిష్యత్వపు వెల గురించి మాట్లాడాడు. ఆయన యేసు యొక్క అనుచరుడు ఎవరైనా చెల్లించే అధిక వెల గురించి మాట్లాడుతాడు,బహుశా మరణంతో కూడా,అది చివరికి నిత్యజీవానికి దారి తీస్తుంది.

చాలా సార్లు మన స్వీయ సంరక్షక ధోరణులు మనలను పూర్తిగా దేవునికి అంకితం చేయకుండా మరియు సేవ చేయకుండా అడ్డుకుంటాయి. వారు క్రీస్తును అనుసరిస్తున్నప్పుడు అన్నింటిలోకి వెళ్ళకుండా మనకు సాకులు ఇస్తారు మరియు నులివెచ్చని క్రైస్తవ జీవితాలను గడుపుతూ మనలను పక్కన పెడతారు. యేసు పరలోకం యొక్క బహుమాన వ్యవస్థ గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన ప్రతి మనుష్యునికి (మరల వచ్చినప్పుడు) వారు చేసిన దాని ప్రకారం ప్రతిఫలమిస్తాను అని ఆయన చెప్పాడు.

మిమ్ములను మీరు ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలు:
నీవు ఆక్రమించిన లోకము లోని చిన్న భాగంలో దేవుని సేవ చేయడానికి నీవు ఏమి చేస్తున్నారు?
నీవు క్రీస్తుకు మరియు ఆయన శరీరానికి దూరంగా ఉంటూ నిన్ను నీవే రక్షించుకోవడానికి మరియు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నావా?
నీవు దానిని ఎలా మార్చగలరు?

读经计划介绍

యేసుతో ముఖాముఖి

మనతోనూ, మనలోనూ తన నివాసాన్ని చేసుకొన్న మన నిత్యుడైన దేవుని గురించి పరిచితమైన సత్యాలతో మనలను మనం సేదదీర్చుకోడానికి శ్రమల కాలము ఒక గొప్ప సమయం. ఈ బైబిలు ప్రణాళిక ద్వారా, ఇది ఒక దిక్సూచిగా మిమ్ములను సంపూర్ణంగా పూర్తి నూతన స్థాయిలో యేసుతో సమయాన్ని అనుభవించుటకు నడిపించే దేవుని వాక్యముతో ఈ 40 రోజులూ ప్రతి దినం కొన్ని నిమిషాలు వెచ్చిస్తారు అని మా నిరీక్షణ.

More